• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘రామాయణ’ 9 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఏకంగా 1100 కోట్ల క్లబ్బులో..

‘రామాయణ’ 9 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఏకంగా 1100 కోట్ల క్లబ్బులో..

Ramayana 9 Days Box Office Collection: ‘రామాయణ’ ఇతిహాసంపై తెలుగు సహా వివిధ భాషల్లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి. తాజాగా నమిత్ మల్హోత్ర నిర్మాణంలో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 12:48 PM IST|Updated: Nov 14, 2026, 12:50 PM IST
joinshare
‘రామాయణ’ 9 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఏకంగా 1100 కోట్ల క్లబ్బులో..
Image Credit: Ramayana Part 1 (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పైకెమెరా కలకలం.. భక్తుడిని అదుపులోకి తీసుకున్న భద్రత సిబ్బంది..

Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పైకెమెరా కలకలం.. భక్తుడిని అదుపులోకి తీసుకున్న భద్రత సిబ్బంది..

2

‘రామాయణ’ 9 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఏకంగా 1100 కోట్ల క్లబ్బులో..

3

Gold Price Today: బంగారం ధరల పతనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి రేట్లు! 10 గ్రాముల ధర ఎంతంటే?

4

Samsung నుంచి అదిరిపోయే 5G ఫోన్‌.. Galaxy A18 5G వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవే!

5

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై ఎందుకు ఈ అప్‌డేట్.. సడెన్‌గా ఫోటో ఎందుకు రిలీజ్ చేసినట్టు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ramayana Box office Report:ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా వరుసగా ఏడు రోజులు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మంచి శుభారంభాన్ని అందించింది. ఇప్పటికే 8వ రోజు అరుదైన 1000 కోట్ల ఎలైట్ క్లబ్బులో ప్రవేశించింది. హిందీ నుంచి వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆరో చిత్రం. రీజనల్ సినిమాలతో కలిపితే 11వ భారతీయ చిత్రం.

ఇది రామాయణం కాదు.. రావణాయం అని  కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినా.. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో మర్యాద పురుషోత్తముడు  శ్రీరాముడు గురించే కాకుండా.. రావణాసురుడుతో పాటు సీత, లక్ష్మణుల పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 
మొత్తంగా  శ్రీరాముడు తన ‘రామాయణ’ పేరిట బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 151 కోట్లు.. రెండో రోజు రూ. 110 కోట్ల గ్రాస్ రాబట్టింది.. థర్డ్ డే  రూ. 160.25 కోట్లు.. నాల్గవ రోజు రూ. 128.60 కోట్లు కొల్లగొట్టాయి. సోమవారం ఐదో రోజు  ఏకంగా రూ. 160కోట్ల గ్రాస్.. ఆరో రోజు రూ. 155 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఏడో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 120కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఎనిమిదో రోజు.. రూ. 97 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. తొమ్మిదో రోజు రూ. 97.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఎనిమిది రోజుల్లో రూ. 1110 కోట్ల గ్రాస్..

‘రామాయణం’ ఫస్ట్ వీక్ 452.73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శుక్రవారం రూ. 37 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా  మన దేశంలో హిందీలో నెట్ 490 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ రూ. 378.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మన దేశంలో రూ. 732.20 కోట్లు.. నెట్ వసూళ్ల విషయానికొస్తే.. రూ 612.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా నిన్నటి వరకు 1110.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ రోజు శని వారం, రేపు ఆదివారం ‘రామాయణ’ సినిమా వసూల్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ రెండు రోజుల్లో మరో రూ. 200 కోట్ల గ్రాస్ వసూల్లు  దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఏది ఏమైనా ‘రామాయణ’ వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 800 కోట్ల వరకు జరిగింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం రూ. 1600 కోట్ల గ్రాస్, రూ. 800 కోట్ల షేర్ రాబట్టాల్సిన  అవసరం ఉంది. ఇప్పటి వరకు 1110 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. మరో రూ. 490 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. మొత్తంగా ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie