SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈసారి సొంతూరిలో సంక్రాంతి కష్టమేనా? హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రధాన రైళ్లన్నీ ఫుల్.. ఇక మిగిలిన దారి ఇదే!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి రైలు ప్రయాణం ఇప్పటి నుంచే భారంగా మారింది. పండుగకు రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రధాన రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోయాయి. ముఖ్యంగా జనవరి 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లన్నింటిలోనూ 'రిగ్రెట్' చూపిస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 16, 2026, 09:15 IST | Updated: Nov 16, 2026, 09:19 IST
Image Credit: Sankranti Travel Alert:
Join

Sankranti Travel Alert: వెయిటింగ్ లిస్ట్‌లోనూ టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. దీంతో పండుగకు సొంతూరు వెళ్లాలనుకునే వారు ఎలా వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. రైళ్లలో రిజర్వేషన్‌ను గరిష్టంగా 60 రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. సంక్రాంతికి మూడు రోజుల ముందు ప్రయాణికులు సిద్ధమవుతారు. దీంతో జనవరి 11 నుంచే రద్దీ భారీగా ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లతో పాటు మహబూబ్‌నగర్ నుంచి మొదలయ్యే రైళ్లకు, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి మార్గాల్లో నడిచే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

సాధారణంగా స్లీపర్ క్లాస్ టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈసారి ఏసీ బోగీల్లోనూ రిజర్వేషన్లు వేగంగా పూర్తయిపోయాయి. పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిమితి దాటిపోయి 'రిగ్రెట్' చూపిస్తోంది. విశాఖపట్నం దూరంతో ఉన్న గరీబ్‌రథ్, వందే భారత్ రైళ్లలో అన్ని కోచ్‌లు ఏసీనే అయినా, ఆ రైళ్లలోనూ టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ ధరలు అధికంగా ఉండే వందే భారత్ రైలులోనూ జనవరి 10, 12, 13 తేదీలకు భారీ డిమాండ్ ఉంది. కొన్ని తేదీల్లో వెయిటింగ్ లిస్ట్ సంఖ్య 130 నుంచి 270 వరకు చేరుకుంది.

హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే గౌతమి, నారాయణాద్రి, శబరి, కోణార్క్, విశాఖ, గోదావరి, నరసాపూర్ తదితర రైళ్లలోనూ రిజర్వేషన్ల పరిస్థితి 'రిగ్రెట్'కు చేరింది. దీంతో నిలబడైనా వెళ్దామని, కుటుంబంలో ఒకరికి సీటు దొరికినా సర్దుబాటు చేసుకుందామనుకునే వారికి కూడా అవకాశం లేకుండాపోయింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో 9, 10, 11 తేదీల్లో మాత్రమే టికెట్లు ఉండగా, 12, 13 తేదీలు వెయిటింగ్ లిస్ట్‌కు వెళ్లిపోయాయి. ఇక నల్గొండ, గుంటూరు మీదుగా కొనసాగే హైదరాబాద్–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం జనవరి 9 నుంచి 13 తేదీల వరకు టికెట్లు ఉన్నాయి.

Read Also: టికెట్ల టెన్షన్‌కు చెక్.. క్రిస్మస్, సంక్రాంతి కోసం ప్రత్యేక రైళ్ల పొడిగింపు, ఏయే తేదీల్లో నడుస్తాయంటే?
 

ప్రతి ఏటా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. ఒడిశాకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ముందస్తుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లపై ప్రకటన చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదనపు రైళ్లను నడపాల్సిన అవసరం ఉంది. మరోవైపు రైలు టికెట్లు దొరక్క ప్రయాణికులు బస్సులు, ప్రైవేట్ వాహనాల వైపు చూస్తున్నారు. పండుగ సమయంలో బస్సుల్లోనూ రద్దీ, చార్జీల భారం పెరిగే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES