• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Murasu Cyclone: ముంచుకొస్తున్న మురసు తుపాన్.. ఏపీ, తెలంగాణల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.!.

Murasu Cyclone: ముంచుకొస్తున్న మురసు తుపాన్.. ఏపీ, తెలంగాణల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.!.

Cyclone murasu effect: అర్నబ్ తుపాన్ ప్రభావం నుంచి ఇంకా కొలుకోలేక జనాలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇప్పటికి పలుచోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో తుపాన్ గండం రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది.

Written ByInamdar Paresh
Published: Nov 01, 2026, 02:04 PM IST|Updated: Nov 01, 2026, 02:14 PM IST
joinshare
Murasu Cyclone: ముంచుకొస్తున్న మురసు తుపాన్.. ఏపీ, తెలంగాణల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.!.
Image Credit: cyclone murasu effect

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఇల్లీగల్ ఎఫైర్స్‌కు  నరకంలో ఎలాంటి  శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

ఇల్లీగల్ ఎఫైర్స్‌కు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

2

ఈ రైలుకు 90 ఏళ్ల చరిత్ర ఉంది.. దీని పేరుపై ఓ మూవీ కూడా ఉంది.. ఈ రైలును ఎందుకు ఆపేశారు..!

3

గేదెకు గ్రాండ్ బర్త్‌డే పార్టీ.. కేక్ కట్ చేసిన రైతు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

4

కాశ్మీర్ లోయ అందాలు.. లక్షన్నర పూలకు.. ఒక్క కిలో కుంకుమపువ్వు!

5

వామ్మె.. యువకుడి చేతిని మింగేందుకు ప్రయత్నించిన భారీ కొండచిలువ.. వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Murasu impact on both ap and telangana: అర్నబ్ తుపాన్  ప్రభావంతో ఏపీ భారీ నష్టంకు వాటిల్లింది.  ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు తుపాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఇప్పటికి పలు చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు  అర్నాబ్ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గక ముందే మరో తుపాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై తన ప్రభావంచూపనుంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలపై మురసు తుపాన్ విరుచుకు పడుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళ  ఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త బలమైన తుపాన్ గా మారనుంది. దీనికి మురసుగా నామకరణం చేశారు. దీని వల్ల  భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 23 కి. మీ. వేగంతో బలంగా కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోను బలమైన గాలులతో, భారీవర్షం కురుస్తుందని వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఇప్పుడు మురాసు తుఫానుగా బలపడింది.  

దీని ప్రభావం వల్ల రానున్న కొన్ని గంటల్లో.. నవంబర్ 2 అర్ధరాత్రి, కావలి - చీరాల మధ్య ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు కనిపిస్తుందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నవంబర్ 2-3 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు, భీకర గాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది.

ఇక మురసు వల్ల తెలంగాణలో.. నవంబర్ 3-4-5 తేదీల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి - భువనగిరి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మురాసు తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో నవంబర్ 3-4-5 తేదీల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మురసు తుపాన్ ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు వెళ్లకూడదని,రైతులు పలు జాగ్రత్తలు తీసుకొవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
AP Weather
Telangana Weather
Weather Update