Sunrays did not touch in arasavelli Suryanarayana swami temple: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుడి ఆలయంలో ప్రతి ఏటా సూర్య భగవానుడి ఆలయంలో ఉత్తరాయణం, దక్షిణాయన మార్పుల నేపథ్యంలో మార్చి 9,10 తేదీలలో, అక్టోబర్ 1,2 తేదీల్లో సూర్యుడి కిరణాలు అరసవెల్లి సూర్య భగవానుడిని తాకడం ఆనవాయితీగా వస్తుంది.ఈ సారి కూడా భక్తులు భారీగా అక్టోబర్ 1 నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి అరస వల్లి ఆలయంకు తరలివచ్చారు.
ఈ అద్బుత దృశ్యంను చూసేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూలు కట్టారు. కానీ అనూహ్యంగా సూర్యకిరణాలు మాత్రం అరసవల్లి సూర్యభగవానుడి కిరణాలను తాకలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాషకు లోనయ్యారు. మరోవైపు ఆలయ పూజారులు, స్థానికులు సైతం ఇలాంటి సిట్యువేషన్ ఎప్పుడు చూడలేదని, కొన్నేళ్లుగా ఈ విధంగా అరసవల్లికి వచ్చి సూర్యభగవానుడ్ని దర్శించుకుంటామని చెబుతున్నారు.
మరోవైపు అక్టోబరు 2 న అంటే శుక్రవారం అయిన సూర్య కిరణాలు మూలవిరాట్టుకు తాకుతుందో లేదోచూడాలని పండితులు, స్థానికులు చెబుతున్నారు. ఇక వాతారణంలోని మార్పులు,ఎల్ నినో ప్రభావంతో కూడా ఈవిధంగా జరిగి ఉండొచ్చని మరికొంత మంది చెబుతున్నారు.
క్యూలైన్ లో ఉన్న భక్తులు మాత్రం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
అరసవల్లిని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా డెవలప్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్వదేశ్ దర్శన్ కింద కేంద్రం నిధులు కేటాయించిందని, దీనికి గాను ప్రధాని మోదీకి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.