• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • / Thalliki Vandanam Second Phase: 3.29 లక్షల మందికి రూ.13,000.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Thalliki Vandanam Second Phase: 3.29 లక్షల మందికి రూ.13,000.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Thalliki Vandanam Second Phase: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందించే తల్లికి వందనం పథకంకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రెండో విడత ఆర్థిక సాయం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విడతలో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేయడానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

Written ByVishnu Priya
Published: Oct 04, 2026, 04:19 PM IST|Updated: Oct 04, 2026, 04:31 PM IST
joinshare
 Thalliki Vandanam Second Phase: 3.29 లక్షల మందికి రూ.13,000.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

2

Kollam Anju Case: అశ్లీల వెబ్‌సైట్‌లో శోభనం వీడియోలు..నవ వధువును ఘోరంగా టార్చర్ చేస్తున్న వరుడు!

3

ఆధార్, పాన్ కార్డ్‌లో అడ్రస్ మార్చాలా? నిమిషాల్లో ఇంట్లోనే ఇలా మార్చుకోండి!

4

పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

5

New Job Card: 15 రోజుల్లోనే కొత్త జాబ్ కార్డు.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 Thalliki Vandanam Second Phase: రెండో విడత సాయానికి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ పరిశీలించి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తుది అనుమతి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ పథకం ద్వారా డబ్బులు అందే తల్లులు ఎదురుచూస్తున్నారు.

ఈ విడతలో సుమారు 3.29 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఆర్థిక ప్రయోజనం అందనున్నట్లు సమాచారం. ఒక్కో అర్హత ఉన్న తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నగదు జమ అయ్యే తేదీపై అధికారికంగా తుది ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద పలువురు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అలాంటి లబ్ధిదారులను కూడా గుర్తించి ఈ విడతలో ప్రయోజనం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన అర్హుల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల నగదు పొందలేకపోయిన వారికి కూడా ఈ విడతలో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో పడతాయనే విషయంపై తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి నుంచి తుది అనుమతి వచ్చిన తర్వాత నగదు జమ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందువల్ల అర్హులైన విద్యార్థుల తల్లులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం వంటి వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

అయితే రూ.13,000 జమ తేదీ, తుది లబ్ధిదారుల జాబితా వంటి వివరాలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం కోసం లబ్ధిదారులు వేచి చూడాల్సి ఉంటుంది.

Read More: AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?

Read More: Gas Cylinder Blast: చంద్రబాబు సభ వద్ద కలకలం.. పేలిన గ్యాస్ సిలిండర్

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh