• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?

AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?

AP PRC Chairman Dinesh Kumar: ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) చైర్మన్‌‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తాజాగా వెలువడ్డాయి.

Written ByHarish Darla
Published: Oct 01, 2026, 01:38 PM IST|Updated: Oct 01, 2026, 01:49 PM IST
joinshare
AP PRC Chairman: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..పీఆర్సీ ఛైర్మన్‌ను నియామం..వచ్చే ఏడాది జీతాల పెంపు?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP PRC Chairman Dinesh Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ దారుల వేతనాలు, సేవా నిబంధనలను సమీక్షించడానికి పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 5వ తేదీన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో నిర్వహించిన సమావేశంలో పీఆర్‌సీ చైర్మన్‌ను నియమిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రభుత్వం ఈ నియామకాన్ని జరిపింది. 

పెరుగుతున్న జీవన వ్యయం, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్ల కనీస, గరిష్ఠ వేతనాలను కొత్తగా నియమితులైన 12వ వేతన సవరణ కమిషన్ ఛైర్మన్ దినేశ్‌కుమార్ సమీక్షించనున్నారు. ఈ పరిశీలన ఆధారంగా తయారు చేసిన సమగ్ర నివేదికను పీఆర్‌సీ చైర్మన్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. దీని ఆధారంగానే ప్రభుత్వం తుది వేతనాలను నిర్ణయిస్తుంది.

సుదీర్ఘ పాలనా అనుభవం.. 
పీఆర్‌సీ చైర్మన్‌గా ఎంపికైన దినేశ్‌కుమార్ 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈయన. 2017 మార్చి 31 నుంచి 2018 సెప్టెంబరు 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. తన సుదీర్ఘ పరిపాలనా కాలంలో రాష్ట్రంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ అనేక కీలక ఉన్నత పదవులను ఆయన నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసి క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పరిపాలన అందించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్ల సమయంలో సహాయ చర్యలను పర్యవేక్షించే విపత్తు నిర్వహణ విభాగంలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర స్థాయిలో ఢిల్లీలో జౌళి అభివృద్ధి కమిషనర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఈయనకు ఉంది.

అలాగే 2014 డిసెంబరులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌గా దినేశ్‌కుమార్ నియమితులయ్యారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి కల్తీ వివాదంపై విచారణ జరిపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈయన్ను ఏకసభ్య కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈ విశేష పాలనా అనుభవం, దక్షతను పరిగణనలోకి తీసుకుని పీఆర్‌సీ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Employees
Telugu News