SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Snake Video: మహాఅద్భుతం.. శివలింగంను చుట్టు పడగవిప్పిన మూడు నాగుపాములు.. వీడియో..

Nellore snake video: పడగ విప్పి శివలింగం వద్ద చుట్టుకుని ఉన్న మూడు నాగుపాములను చూసి భక్తులు శివమహిమగా భావిస్తున్నారు. అది కూడా సోమవారం రోజు ఈ ఘటన వెలుగులోకి రావడంతో భక్తులు భారీగా ఆలయంకు క్యూలు కట్టారు.

Written By Inamdar Paresh
Published: Oct 05, 2026, 07:57 AM IST | Updated: Oct 05, 2026, 08:07 AM IST
Image Credit: Snakesonshivalingamnellorevideo
Join

Three cobras were spotted at the shiva lingam in Nellore: ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో, గుళ్లలో సైతం  కోబ్రాలు దర్శనమిస్తున్నాయి. అందుకే కోబ్రాలతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి. 

 

అవి శివలింగం ఎదురుగా పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం పూట ప్రతి రోజులాగే పూజారీ ఆలయం తలుపులు తీసి చూసే సరికి మూడు పాములు పడగ విప్పి మరీ శివలింగం చుట్టు కూర్చున్నాయి.

 భక్తులు కూడా స్వామి దర్శనం కోసం వచ్చిన  వారు ఈ ఘటన  చూసి భక్తితో పొంగిపోతున్నారు. ముఖ్యంగా సోమవారం రోజు నాగేంద్రుడు, సుబ్రహ్మాణ్యుడు ఈ విధంగా తమకు దర్శన భాగ్యం ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఇటీవల తరచూ పాములు ఆలయంలోకి వస్తుండటంతో పూజారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిలో పాము కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

అయితే గతంలో  నాగుల చవితి రోజున కూడా ఇదే  ఆలయంలో రెండు పాములు శివలింగం చుట్టు పడగ విప్పి నిలబడ్డాయి. మరల ఇప్పుడు మూడు పాములు శివలింగం చుట్టు వచ్చి పడగ విప్పడంతో ఇదంతా దైవమహిమగా భక్తులు భావిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES