SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తిరుపతిలో తీవ్ర విషాదం.. నైట్‌ షిఫ్ట్‌లో ఒక్కసారిగా పేలిన బాయిలర్.. నలుగురు అక్కడికక్కడే మృతి! పూర్తి వివరాలు..

తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ హెల్త్ కేర్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సత్యవేడు మండలం శ్రీ సిటీ హెల్త్ కేర్ పరిశ్రమలోని బాయిలర్‌లో ఒక్కసారిగా పేలుడు జరగడం వల్ల ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 03, 2026, 09:59 AM IST | Updated: Oct 03, 2026, 11:45 AM IST
Image Credit: Tirupati Sri City Boiler Blast 4 killed
Join

Tirupati Sri City Boiler Blast 4 killed: తిరుపతిలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీ సిటీలోని హెల్త్ కేర్ కంపెనీలో నైట్ షిఫ్ట్ సమయంలో బాయిలర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నైట్ షిఫ్టులో పనిచేస్తున్న కార్మికులు ఈ పేలుడు కారణంగా చిక్కుకుపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. భారీ శబ్దంతో జరిగిన ఈ పేలుడు కారణంగా నలుగురు మరణించగా, మరొక కార్మికుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాయిలర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇది సాంకేతిక లోపమా? లేక అధిక ఒత్తిడి వల్ల జరిగిందా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. అలాగే, ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది.

నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి..
తిరుపతి శ్రీ సిటీలో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం అని ఆయన అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూనే, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొంటూ, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Read Also:  విశాఖ బీచ్‌లో విషాదం.. రుషికొండలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు! దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబుకు తండ్రి గుండెకోత మెసేజ్!

Read Also: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
శ్రీ సిటీలో వాటర్ బాయిలర్ పేలిపోయి నలుగురు మరణించిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా, బాధితులకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ పరిస్థితిపై ఆయన పూర్తి వివరాలు ఆరా తీశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES