Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 4 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. అసలు కారణం ఏమిటంటే.?..
Ap local body polls: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలతో రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Ttd cancels vip break darshan in Tirumala: తిరుమలలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. సుదర్శన చక్రత్తాళ్వార్లకు అర్చకులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయించారు. ఇదే క్రమంలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శ్రీవారి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి పలు అవతారాల్లో భక్తులకు దర్శన భాగ్యంకల్పించారు. మన దేశంనలు మూలల నుంచి భక్తులు తిరుమలకు భారీగా తరలి వచ్చి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సామాన్య భక్తులే తొలి ప్రాధాన్యతగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారామోగిన విషయం తెలిసిందే.
ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఈ క్రమంలో తిరుమలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖుల సిఫార్సు లేఖలపై అనుమతించే వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 4 వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సక్సెస్..
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కనివీని ఎరుగని రీతిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 12 న మొదలైన ఉత్సవాలు ఈరోజు దసరా పండగ వేళ చక్రస్నానంతో వైభవంగా ముగిశాయి.
విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని, అద్బుతమైన విద్యుత్ అలంకరణలు చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
భారీ వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగిన భక్తిశ్రద్ధలతో భక్తులు వాహనసేవలను దర్శించుకున్నారని టీటీడీ పేర్కొంది. గడిచిన 8 రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకున్నారని, కానుకల ద్వారా రూ.25.79 కోట్లు ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది. గరుడసేవ రోజున వర్షంలోనూ భక్తులకు నిరంతర సేవలందించారన్నారు. 26 రాష్ట్రాలు, ఖతర్, దుబాయ్ నుంచి 6,777 మంది కళాకారులు వచ్చి తిరుమలలో ప్రదర్శనలు చేశారని టీటీడీ తెలిపింది.