SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉత్తరాంధ్ర హై అలర్ట్.. రాత్రి తీరం దాటే ఛాన్స్.. స్కూళ్లకు సెలవులు..

Uttarandhra High Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడింది. అది తీరం వైపు దూసుకువస్తోంది. ఇవాళ రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య ఇది తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 23, 2026, 11:01 AM IST | Updated: Sep 23, 2026, 11:07 AM IST
Image Credit: Andhra Pradesh Rain Alert
Join

Low Pressure in Coastal Andhra: ఉత్తరాంధ్రలో వాయు గుండం ప్రభావంతో ఇవాళ , రేపు  పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందంటూ  రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి తీవ్రమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

స్కూళ్లకు సెలవులు..

వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అన్ని స్కూల్లకు సెలవులు ప్రకటించారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా జిల్లా కలెక్టర్స్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. అతిభారీ వర్షాల హెచ్చరికలతో.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.. 
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. రైల్వేశాఖ కూడా శ్రీకాకుళం నుంచి వెళ్ళే రైళ్ళ రాకపోకలలో మార్పులు చేసింది. నేటి రాత్రి విశాఖ - గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనుంది. మరోవైపు ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంట్ స్తంభాలకు దూరంగా ..హోర్డింగులకు దూరంగా ఉండాలని చెప్పారు.  

వాయుగుండం ప్రభావంతో ఘాట్‌రోడ్లలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది.  భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొండ వాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

కోస్తాంధ్ర ప్రాంతాల్లో రైల్వేల సేవలకు అంతరాయం.. 
భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. విశాఖ–కొత్తవలస–కిరండోల్ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రెండు రోజులు పాటు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.  వాయుగుండం కారణంగా రైల్వే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు రైల్వే శాఖ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు.

Also Read:ప్రధానిగా 12 యేళ్లు.. ప్రభుత్వాధినేతగా@25ఇయర్స్.. మోడీ ఖాతాలో రేర్ రికార్డులు..

Also Read: ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌లున్న దేశాలు.. భారత్ ప్లేస్ ఎక్కడంటే..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES