SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kakinada: ఏపీలో ఘోరం.. బస్సులో సీటు కోసం గొడవ.. మహిళలపై కర్రలు, రాడ్లతో దాడి.!.

Women fight in andhra pradesh: సీటు విషయంలో మహిళల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో సిరిపురం గ్రామానికి చెందిన మహిళ తనను కొట్టారంటూ భర్తకు ఫోన్ చేసి చెప్పింది. కాకినాడలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త పోలీసుల వరకు వెళ్లింది.

Written By Inamdar Paresh
Published: Oct 18, 2026, 01:20 PM IST | Updated: Oct 18, 2026, 01:31 PM IST
Image Credit: women fight in free bus in kakinada
Join

Women fight in apsrtc free bus in Kakinada: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు పథకంను అమలు చేస్తున్నాయి. దీనికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కొన్ని సార్లు మహిళలు సీట్ల కోసం కొట్టుకొవడం, పరస్పరం దాడులు చేసుకొవడం వంటివి చేస్తున్నారు. వీరి గొడవలు కాస్త నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉన్నవేళల్లో సీట్లకోసం మహిళలతో పాటు, పురుషులు కూడా గొడవలు పడిన ఘటనలు కొకొల్లలు. 

తాజాగా.. దసరా వేళ కాకినాడలో బస్సులో కొంతమంది మహిళల మధ్య సీటు విషయంలో గొడవ జరిగింది.ఏపీలోని కాకినాడ జిల్లాలో బస్సులో కొంత మహిళల మధ్యన గొడవ జరిగింది. తుని నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో రచ్చజరిగింది. రాజమండ్రికి చెందిన మహిళలు,  సిరిపురంకు చెందిన మహిళతో గొడవపడ్డారు. 

దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసిన తనను కొట్టారని చెప్పింది.ఇక ఆవేశంలో ఊగిపోయిన భర్త సిరిపురం వద్ద బస్సురాగానే.. 30 మంది యువకులతో బస్సుఎక్కి మహిళలపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశాడు. దీంతో రాజమండ్రికి చెందిన మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని ఆపేందుకు చూసిన మరోయువకుడు గాయపడ్డారు. వెంటనే స్థానికులు 112కు కాల్ చేశారు. పోలీసులు ఘటన ప్రదేశంకు చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. బాధితులను కొట్టి సిరిపురం మహిళ, ఆమె భర్త అక్కడి నుంచి పారిపోయారు. 

బాధితులు, బస్సు డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడి చేసిన వారు మద్యం మత్తులో, గంజాయి సేవించి ఉన్నారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆస్పత్రిలో ఇద్దరు మహిళలకు వైద్యులు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వారికి తలకు తీవ్రగాయాలైనట్లు చెబుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES