SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల హీట్ ప్రేమ వివాహం చేసుకున్న టీడీపీ నేత.. అసలు విషయం ఏమిటంటే..?..

Ap local body polls effect: స్థానిక సంస్థలకు ఈరోజు నగారా మోగనుంది. ఇప్పటికే పురపాలికలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్ల ఖరారయ్యాయి.ఈ క్రమంలో ఏపీలోని పార్వతిపురంకు చెందిన ఒక యువనాయకుడు ప్రేమ వివాహం చేసుకొవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 14, 2026, 08:20 AM IST | Updated: Oct 14, 2026, 08:32 AM IST
Image Credit: Tdpleaderharshavardhan(file)
Join

Andhra pradesh local body polls schedule 2026: ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి ఎన్నికల సమరం జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొన్ని గంటల్లో   రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. ఇప్పటికే ఇప్పటికే పురపాలికలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్ల ఖరారయ్యాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ(బుధవారం) షెడ్యూల్‌ జారీ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఏపీలో రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సన్నద్దమయ్యారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

 ఒకవైపు కూటమి,మరోవైపు వైసీపీ కూడా చైర్మన్ తో పాటు, ఎక్కువ స్థానాలు గెల్చుకునేలా పావులు కదుపుతున్నాయి. వైఎస్ జగన్ గ్రౌండ్ లెవల్ లో కార్యకర్తలు, స్థానిక నేతలతో సమావేశం నిర్వహిస్తు ఎక్కడ కూడా ఏకగ్రీవాలు లేకుండా గట్టిపొటీ ఇవ్వాలని క్యాడర్ కు ఆదేశించారు. అదే విధంగా టీడీపీ, జనసేన సైతం ప్రజల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుని నేతలను, క్యాడర్ ను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలో పార్వతిపురం జిల్లాలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది.  సాధారణంగా ఎన్నికల ప్రచారంలో బరిలో ఉన్న నేతలు ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి నానా పాట్లు పడతారు. 

కొంత మంది పిల్లలకు సపర్యలు చేస్తారు. ఇంట్లోని పనులు చేస్తారు. దోశలు వేయడం, కటింగ్, గడ్డం తీయడంలాంటివి చేస్తారు. ఎలాగైన ఓటరు మహశయుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లుపడతారు. ఈ నేత రిజర్వేషన్ల ను ప్రకటించగానే ప్రేమవివాహం చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు.
 

ఏపీలోని పార్వతీపురం జిల్లా సాలూరు చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు. దీంతో  తనకు అవకాశం లేకపొవడంతో  ఆస్థానం నుంచి తన భార్యను బరిలోకి దింపాలని టీడీపీ నేత హర్షవర్ధన్ భావించాడు. దీంతో రిజర్వేషన్ ప్రకటన తర్వాత పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

తనకు అవకాశం లేకపోవడంతో కనీసం తన భార్యను బరిలోకి దింపాలని సదరు నేత భావించాడు. దీంతో ఇంట్లో వారిని ఒప్పించి మరీ హర్షవర్ధన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే రిజర్వేషన్‌ ప్రకటన వచ్చిన 24 గంటల్లోనే సదరు నేత ప్రేమ వివాహం చేసుకొవడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇక తన భార్యకు టీడీపీ టికెట్‌ కోసం సదరు మాజీ కౌన్సిలర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  దీన్ని బట్టి చూస్తే ఏపీ వ్యాప్తంగా స్థానిక  సమరంలో  రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి వింతలు జరుగుతాయోనంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES