• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Jagan: గంజాయి, బెల్టు షాపులే రాప్తాడు ఘటనకు కారణం.. కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: గంజాయి, బెల్టు షాపులే రాప్తాడు ఘటనకు కారణం.. కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan meets raptadu girl in manipal: ప్రస్తుత ప్రభుత్వం బాధిత బాలిక కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా స్కూల్లోనే దాడులు జరగటం ఏంటని మండిపడ్డారు.

Written ByInamdar Paresh
Published: Nov 02, 2026, 04:28 PM IST|Updated: Nov 02, 2026, 04:42 PM IST
joinshare
YS Jagan: గంజాయి, బెల్టు షాపులే రాప్తాడు ఘటనకు కారణం.. కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: ys jagan on raptadu incident

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

2

Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏఐ, ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా తుషార్‌ వొహ్రా నియామకం

3

Rohit Bigg Boss Elimination: బిగ్‌బాస్‌ 10 హౌస్ నుంచి రోహిత్ ఎలిమినేషన్..కారణం ఇదే? ఎంత సంపాదించాడంటే?

4

IPL 2027 Retention List: రూ.14.2 కోట్ల ఆటగాడికి CSK షాక్..! యంగ్ ఆల్‌రౌండర్‌కు గుడ్‌ బై..?

5

Amit Shah Speech: హైదరాబాద్‌లో అమిత్‌ షా సంచలన ప్రసంగం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan meets raptadu incident girl in manipal hospital: ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం రాప్తాడు ఘటన బాధితురాలికి ప్రస్తుతం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  బాలిక ప్రాణాపాయం నుంచి బైటపడింది.  ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మణిపాల్ ఆస్పత్రికి  వెళ్లి బాధితురాలు గోపికను పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. 

 

“ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి మరీ దాడులు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దారుణాలకు బెల్ట్ షాపులు, గంజాయి అక్రమ విక్రయాలే కారణం. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము పోరాటం చేస్తాం” – వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

— The Speaks (@TheSpeaksX) November 2, 2026

 

ఈ క్రమంలో బాలికను పరామర్శించిన అనంతరం మీడియాతో  మాట్టాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.  ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి మరీ దాడులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాప్తాడు ఘటనకు ఏపీలో విపరీతంగా పెరిగిపోయిన బెల్ట్‌ షాపులు, గంజాయి అక్రమ విక్రయాలే కారణమని ఆరోపించారు.

గంజాయి, మద్యం దుకాణాలను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తెచ్చి.. పిల్లలను వాటికి బానిసల్ని చేస్తున్నారని విమర్శించారు. వీటిని అరికట్టడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే బాధితుల తరఫున పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వంను వైఎస్ జగన్ హెచ్చరించారు. ఇక గత నెల చివర్లో అక్టోబర్ 31న రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోనే బాధితురాలిపై ఆమెకు సమీప బంధువైన హేమంత్ తనతో పెళ్లికి నిరాకరించిందని ఆమెపై రంపంతో దాడి చేశాడు. 

ఈ ఘటనను అడ్డుకున్న మరో బాలిక సైతం తీవ్రంగా గాయపడింది. హేమంత్ పోలీసులపై ఆత్మకూరు అడవిలో దాడి చేయడంతో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన హేమంత్ రెండు కాళ్లను తొలగించే పరిస్థితి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
AP News
Chandrababu Naidu