• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IPL 2027 Retention List: రూ.14.2 కోట్ల ఆటగాడికి CSK షాక్..! యంగ్ ఆల్‌రౌండర్‌కు గుడ్‌ బై..?

IPL 2027 Retention List: రూ.14.2 కోట్ల ఆటగాడికి CSK షాక్..! యంగ్ ఆల్‌రౌండర్‌కు గుడ్‌ బై..?

CSK Released Players List: రాబోయే ఐపీఎల్ మినీ వేలానికి భారీ బడ్జెట్‌ను సమకూర్చుకోవాలని చూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.. రూ.14.2 భారీ ధరకు కొనుగోలు చేసిన యంగ్ ఆల్‌రౌండర్‌ను వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వేలంలో హిట్టర్‌తోపాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌ను తీసుకునేందుకు ప్లాన్ వేస్తోంది.

Written ByAshok Krindinti
Published: Nov 02, 2026, 05:20 PM IST|Updated: Nov 02, 2026, 05:23 PM IST
joinshare
IPL 2027 Retention List: రూ.14.2 కోట్ల ఆటగాడికి CSK షాక్..! యంగ్ ఆల్‌రౌండర్‌కు గుడ్‌ బై..?
Image Credit: CSK Retention List (Source: IANS)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

2

Tirumala: ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్‌ అథారిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ..

3

Bigg Boss Neha Fathima: బిగ్‌బాస్‌లో లేడీ కంటెస్టెంట్ ప్రేమాయణం..ఏకంగా షో‌లోకి వచ్చేసిన తల్లీదండ్రులు..షాకింగ్ మూమెంట్!

4

115 అంగుళాల భారీ స్మార్ట్ టీవీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

5

Jagtial: నేనొస్త.. భయమేస్తుంది.. జగిత్యాల చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో తల్లిదండ్రుల్ని హత్తుకుని ఏడుస్తున్న పసివాడు.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CSK Released Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్ కోసం రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ, ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. జట్టు పర్స్‌లో నిధుల కొరత ఉండటంతో, రాబోయే మినీ వేలానికి బడ్జెట్‌ను పెంచుకోవడానికి భారీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గత వేలంలో ఏకంగా రూ. 14.2 కోట్లు వెచ్చించి తీసుకున్న యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.

గత సీజన్ మినీ వేలంలో చెన్నై ఫ్రాంచైజీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల కోసం భారీ మొత్తాన్ని వెచ్చించింది. యూపీ‌కు చెందిన 20 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌పై భారీ అంచనాలతో సీఎస్‌కే రూ.14.2 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. అయితే ప్రశాంత్‌ వీర్‌కు అవకాశాలు ఇచ్చినా.. అంచనాలను అందుకోవడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వెచ్చించిన భారీ పారితోషికంతో పోలిస్తే ప్రదర్శన ఏమాత్రం మెరుగ్గా లేకపోవడంతో అతడిని కొనసాగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రశాంత్‌తో పాటే అదే ధరకు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ 11 మ్యాచ్‌ల్లో 2 అర్ధసెంచరీలతో 295 పరుగులు చేసి కాస్త బెటర్ పర్మామెన్స్ చేశాడు. దీంతో కార్తీక్‌ను జట్టులో ఉంచుకుని.. ప్రశాంత్‌ను రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై జట్టు పర్స్‌లో రూ.2.4 కోట్లు మాత్రమే ఉంది. ఐపీఎల్ జట్ల పర్సుకు ప్రతి ఏడాది అదనంగా రూ.5 కోట్లు జత కావడంతో ఈ మొత్తం రూ.7.4 కోట్లకు చేరనుంది. మినీ వేలంలో మిడిల్ ఆర్డర్‌లో హిట్టర్‌తోపాటు డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్‌ను తీసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వీర్‌ను రిలీజ్ చేస్తే ఒక్కసారిగా రూ.14.2 కోట్లు చెన్నై పర్స్‌లో మిగులుతాయి.

ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలను సమర్పించేందుకు నవంబర్ 15 చివరి తేదీగా ఉంది. డిసెంబర్ 16న గోవా వేదికగా మినీ వేలం జరగనుంది. ప్రషాంత్ వీర్‌ను విడుదల చేస్తారా..? లేక మరో అవకాశం ఇస్తారా..? అనేది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది. ప్రస్తుతానికి అతడి విషయంలో సీఎస్కే తీసుకోబోయే నిర్ణయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
IPL
CSK
Sports News