• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

Manchu Lakshmi adopts school: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాడమే తన టార్గెట్ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నటి గొప్పమనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 02, 2026, 05:37 PM IST|Updated: Nov 02, 2026, 05:49 PM IST
joinshare
Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.
Image Credit: manchulakshmi(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

2

Tirumala: ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్‌ అథారిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ..

3

Bigg Boss Neha Fathima: బిగ్‌బాస్‌లో లేడీ కంటెస్టెంట్ ప్రేమాయణం..ఏకంగా షో‌లోకి వచ్చేసిన తల్లీదండ్రులు..షాకింగ్ మూమెంట్!

4

115 అంగుళాల భారీ స్మార్ట్ టీవీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

5

Jagtial: నేనొస్త.. భయమేస్తుంది.. జగిత్యాల చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో తల్లిదండ్రుల్ని హత్తుకుని ఏడుస్తున్న పసివాడు.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Manchu Lakshmi adopts 48 government Schools in medak: ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు  ఒకవైపు సినిమాలు తీస్తునే మరోవైపు తమ దాతృత్వంను కూడా చూపిస్తున్నారు. కొంత మంది అనాథశ్రమాలకు తమ చేయుతను అందిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుంటున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ లకు సాయం అందిస్తున్నారు. కొందరు దీన్ని బైటకు చెప్పుకుంటే, మరికొంత మంది మాత్రం రహస్యంగా తమ మంచిపనులు చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో తమ అభిమానులుకు సెలబ్రీటీలు  ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే.. తాజాగా.. టాలీవుడ్ నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి  గొప్ప మనసును చాటుకున్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే టార్గెట్ తో టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థతో మెదక్ జిల్లాలో ఉన్న 48 స్కూళ్లను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంచు లక్ష్మి.. చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఆయా స్కూళ్లలో టీచర్లు, విద్యార్థులతో మంచు లక్ష్మి మాట్లాడారు.  

క్లాసుల్లో డిజిటల్ బోధనలతో పాటు, స్మార్ట్ ఎల్ ఈడీ టీవీలతో పాటు మొదలైన మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందితేనే పిల్లల  భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని మంచు లక్ష్మి మాట్లాడారు. మరోవైపు 48 పాఠశాలలు దత్తత తీసుకొవడంపై ఆయా పాఠశాలలోని సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మోహన్ బాబు, మంచు లక్ష్మి అభిమానులు సైతం ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telangana News
Telugu News