YS Jagan Tweet: ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్.. కూటమి విజయంపై వైఎస్ జగన్ సంచలన ట్విట్..
Ap local body election results: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా జగన్ కంచుకొట అయిన పులివెందులలో మున్సిపల్ చైర్మన్ పీఠంను సైతం టీడీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ట్విట్ చేశారు.
YS Jagan Satirical tweet on ap municipal election results: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ చూసిన కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా జగన్ కంచుకోటను సైతం టీడీపీ బద్దలు కొట్టింది. ఎక్కడ చూసిన కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో కూటమి గెలుపుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్విట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బృందానికి, పోలీసులకు, ఎస్ఈసీకి అభినందనలు అంటూ సెటైరికల్ గా ట్విట్ చేశారు.
ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా, ఎన్నికలలో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారంటూ ఏకీపారేశారు. ప్రతి దశలోనూ ప్రజాస్వామ్యంను అపహస్యం చేశారన్నారు. నామినేషన్ ప్రక్రియను, పరిశీలన, ఉపసంహరణ మొదలైన దశల్లో హైజాక్ చేశారని విమర్శించారు.
ఎన్నికల రోజును పోలింగ్ కేంద్రం నుంచి ఏజెంట్లను బైటకు పంపించి వేశారన్నారు. పోల్ లను తారుమారు చేశారన్నారు. మొత్తంగా ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్ మాత్రమే అంటూ చంద్రబాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని బట్టి ఎన్నికల సంస్కరణ ఆవశ్యకత పకట్బందిగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టంగా కన్పిస్తుందని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.