SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్‌.. కుమార్తె వివాహ వేదికపై కీకల ప్రకటన..

YS Sharmila Tweet About Yalahanka Palace: మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల చూస్తుంటే. తాజాగా బెంగళూరులోని వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన యలహంక ప్యాలెస్ ఇష్యూ ఇపుడు మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అయింది. తాజాగా ఈ ప్యాలెస్ తనదేనంటూ వైయస్ షర్మిల ఎక్స్ వేదిక అన్న జగన్మోహన్ రెడ్డి తీరును ఎండగడుతూ సుదీర్ఘ ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 11:47 AM IST | Updated: Oct 31, 2026, 11:50 AM IST
Image Credit: YS Sharmila Tweet (File/Source)
Join

YS Sharmila Vs YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్‌సీపీ సుప్రీమో వై.యస్. జగన్మోహన్ రెడ్డికి ఆమె చెల్లెలు ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన వై.యస్. షర్మిల మధ్య మరోసారి ఆస్తి వివాదం రాజుకుంది. బెంగళూరులో వై.యస్.జగన్ ఉంటున్న యలహంక ప్యాలెస్‌లో తన కూతురు పెళ్లికి అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో ఈ ఇష్యూ చినికి చినికి గాలివానల మారింది.

తాజాగా ఈ అన్నా చెల్లెల్ల మధ్య చిచ్చు రేపుతోన్న   ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల ఎక్స్ వేధికగా సంచలన ట్వీట్ చేశారు. తనది కాని దానికోసం ఆశపడే నీచ మనస్తత్త్వం తనది కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం తనకే దఖలు పడిందన్నారు. ఆ ప్యాలెస్ తన పిల్లల భాగానికి వచ్చిందని తెలిపారు. ఇది దేవుడి సాక్షిగా నిజం.

 


తన బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కాబట్టి, కుమార్తె అంజిలి కోరినట్లుగా ఆమె వివాహం అక్కడ చేయాలనుకున్నాను.  తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా అదే విషయాన్ని చెబుతారు.  సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమన్నారు.  తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదికగా మారాలన్న తన  బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయినందుకు  చాలా బాధపడుతున్నామని షర్మిల ఎక్స్ వేదిక ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, తన బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు వైయస్ జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ ఆస్తి షర్మిలదే అన్నట్టు నోటరీ కాగితం చూపించిన సంగతి తెలిసిందే కదా. 
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES