SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YSRCP Candidates: స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

YSRCP Announces Municipal Candidates For Local Body Elections: ఏపీలో స్థానిక రాజకీయం హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైరన్‌ మోగించింది. ఎన్నికలకు సిద్ధమంటూ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాన స్థానాలకు మేయర్లు, చైర్మన్ల అభ్యర్థులను ప్రకటిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రకటన విడుదల చేసింది.

Written By Ravi Kumar Sargam
Published: Oct 15, 2026, 10:49 PM IST | Updated: Oct 15, 2026, 10:58 PM IST
Image Credit: YSRCP Candidates For Municipal Elections
Join

YSRCP Candidates: స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేయడం.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక సమతూకం పాటిస్తూ.. మహిళలకు ప్రాధాన్యం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు మున్సిపల్‌ చైర్మన్లు, నగర పంచాయతీల చైర్మన్‌ల ఎన్నికలు ప్రత్యక్షంగా ఎన్నుకోనుండడంతో వాటికి సంబంధించి అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. తొలి జాబితాను వైఎస్సార్‌సీపీ విడుదల చేయగా.. వాటిలో రాష్ట్రంలోని కీలకమైన స్థానాలు ఉన్నాయి. 6 నగర పంచాయతీలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించింది. విజయనగరం మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణిని ఎంపిక చేయగా.. గ్రేటర్‌ విశాఖపట్టణం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణిని అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. రిజర్వేషన్లకు అనుగుణంగా

మేయర్‌ అభ్యర్థుల జాబితా
విజయనగరం మేయర్‌ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి
విశాఖ మేయర్‌ అభ్యర్థిగా వరుదు కల్యాణి
ఏలూరు మేయర్‌ అభ్యర్థిగా గంటా మోహన్‌రావు
మచిలీపట్నం మేయర్‌ అభ్యర్థిగా లంకా జ్యోతి
ఒంగోలు మేయర్‌ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్‌ 
నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి 
కడప మేయర్‌ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి

మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థులు 
ఇచ్చాపురం: రాజ్యలక్ష్మి
పలాస: తలసు శ్రీపద్మ
నర్సీపట్నం: చింతకాయల అనిత
యలమంచిలి: బి.తులసి
తుని: పిట్ల రామతులసి
కొవ్వూరు: మన్నె పద్మ
రామచంద్రాపురం: నాగేశ్వరరావు
కొండపల్లి: నల్లమోతు తేజస్వీ
తెనాలి: మద్దలి శేషాచలం
చీరాల: డా.ఇస్తార్ల శెర్లి
బద్వేల్‌: రాచపూడి వెంకట సాయి కృష్ణ
ప్రొద్దుటూరు: పొర్రెడ్డి నరసింహారెడ్డి
పులివెందుల: వైఎస్‌ ప్రమీలమ్మ
మదనపల్లె: జింక చలపతి

నగర పంచాయతీ అభ్యర్థులు
ఏలేశ్వరం: బదిరెడ్డి ఆశా లత
ఉయ్యూరు: పైడముక్కల దివ్య
గురజాల: పోలు వీరా రెడ్డి
కనిగిరి: పులి శాంతి రెడ్డి     
బుచ్చిరెడ్డిపాలెం: షేక్ షకీలా బేగం 
కమలాపురం: మార్జుల కవిత

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES