SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Byreddy Siddharth Reddy: ZPTC MPTC ఎన్నికల పోలింగ్.. వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్

Byreddy Siddharth Reddy House Arrest: ZPTC, MPTC ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూరికి వెళ్లిన వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుండగా అడ్డుకున్నారు. ఇటీవల నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Written By Ashok Krindinti
Published: Nov 05, 2026, 12:17 PM IST | Updated: Nov 05, 2026, 12:20 PM IST
Image Credit: Byreddy Siddharth Reddy House Arrest
Join

Byreddy Siddharth Reddy House Arrest: వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన తన స్వగ్రామానికి వెళ్లారు. ఓటు వేసేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ముచ్చుమర్రికి చేరుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని ఇంటి నుంచి బయటకు వస్తుండగా.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆయన ఓటు వేయకుండా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆయనను హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

నందికొట్కూరులో వైసీపీకి విజయం

ఇటీవల జరిగిన నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలకు అనుకూల ఫలితాలు వచ్చినా.. నందికొట్కూరులో మాత్రం వైసీపీ జెండా ఎగిరింది. మొత్తం 32 వార్డుల్లో 23 స్థానాలను వైసీపీ గెలుచుకోగా.. టీడీపీ 9 వార్డులకే పరిమితమైంది. ఈ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి పేరు మరోసారి మార్మోగింది.

నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కౌంటింగ్‌లో అన్యాయం జరిగిందని.. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ టీడీపీ నాయకులు పట్టుబట్టారు. కొన్ని గంటలపాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. దీంతో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలతో కలిసి కౌంటింగ్ కేంద్రం సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కౌంటింగ్‌ను తిరిగి ప్రారంభించిన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి విమర్శలు

మున్సిపల్ ఎన్నికల్లో సీపీ విజయం అనంతరం బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వాలని కోరితే ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అదే సమయంలో నందికొట్కూరు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. తాజాగా ZPTC, MPTC ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ వేళ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES