• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

గంజి నీళ్లను తాగడం మన బామ్మల కాలంనాటి నుంచి ఉన్న అలవాటే. అయితే, దీంతో మీ చర్మంలో కూడా నమ్మలేని 5 ప్రయోజనాలు కూడా పొందుతారు. ప్రధానంగా ఈ నీళ్లను తాగడం వల్ల మీ చర్మానికి మంచి హైడ్రేషన్‌ లభించడంతోపాటు కాంతివంతమైన చర్మం పొందుతారు.

Written ByRenuka Godugu
Published: Nov 05, 2026, 02:34 PM IST|Updated: Nov 05, 2026, 02:37 PM IST
joinshare
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!
Image Credit: Rice Water Daily for Glowing Skin

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rice Water Daily for Glowing Skin: ఆరోగ్యకరమైన చర్మం కోసం అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అయితే, ఎప్పుడైనా మీ బామ్మల కాలంనాటి చిట్కాలను పాటించారా? దీంతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండానే మచ్చలేని ఆరోగ్యకరమైన చర్మం కూడా పొందుతారు. కొన్ని శతాబ్దాలుగా గంజినీళ్లను మన ఆసియా ఖండంలో తాగే అలవాటు చాలా మందికి ఉంది. అంతేకాదు బియ్యం కడిగిన నీటితో జుట్టు, ముఖం కూడా కడుగుతారు. గంజినీళ్లను తాగుతారు. దీన్ని సాధారణంగా బియ్యాన్ని కడిగి, ఉడకబెట్టి తయారు చేస్తారు. ఇందులో మన చర్మానికి కావాల్సిన ఖనిజాలు ఉంటాయి. అందుకే దీన్ని చర్మానికి టానిక్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, అమైనోయాసిడ్స్‌ ఉంటాయి.  రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన చర్మానికి మంచి పోషణ కూడా లభిస్తుంది. ముఖంపై అప్లై చేసే కంటే నేరుగా తీసుకోవడం వల్ల చర్మానికి 5 అద్బుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ మధ్య కాలంలో ఇది సైంటిఫిక్‌ పరిశోధనలు కూడా వీటిని సపోర్ట్‌ చేయడం ప్రారంభించాయి.  ఇది చర్మ ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది.

మంచి హైడ్రేషన్‌..
ఈ గంజినీళ్లలో సహజంగా గంజి పదార్థం కాబట్టి, బియ్యం నుంచి వచ్చిన సెరమైడ్స్‌ చర్మ ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి.  అంతేకాదు మంచి మాయిశ్చర్‌ కూడా ఇస్తుంది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ రిపోర్టుల ప్రకారం ఈ రైస్‌ సెరమైడ్స్‌ ట్రాన్సెపిడెర్మల్‌ నీటిని కోల్పోకుండా చర్మానికి హైడ్రెషన్‌ నిలుపుతాయి. సాగే గుణాన్ని కూడా అందిస్తుంది. ఈ గంజినీళ్లు చర్మానికి ఒక రక్షణ పొరగా కూడా పనిచేస్తుంది. తద్వారా కాలుష్యం, సీజనల్‌ మార్పులకు చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్స్‌..
ఈ గంజినీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ అయిన ఫెరులిక్‌ యాసిడ్‌, గమ్మా ఒరైజనల్‌ సమ్మేళనాలు ఉంటాయి.  ఇది ఫ్రీ ర్యాడికల్‌ను సమతూలం చేస్తాయి. దీంతో మీ చర్మంపై త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించవు. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి కూడా కాపాడుతుంది. ఈ రైస్‌ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మీ చర్మ కణాలు డ్యామేజ్‌ కాకుండా కాపాడుతాయి.

కాంతివంతమైన చర్మం..
ఈ గంజినీళ్లను తరచూ తీసుకోవడం వల్ల మీ స్కిన్‌ టోన్‌ కూడా మెరుగవుతుంది. వాపును తగ్గించడం మాత్రమే కాదు మెలనిన్‌ ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది. దీంతో మీ ముఖంపై పిగ్మెంటేషన్‌ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. ఓపెన్‌ లేబుల్‌ క్లినికల్‌ స్టడీల ప్రకారం ఈ నీళ్లు చర్మానికి సాగే గుణం అందిస్తాయి. తరచూ ఈ నీటిని తాగడం వల్ల లోపలి నుంచి కూడా మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.

సున్నితమైన చర్మానికి కూడా..
చాలామంది సున్నితమైన చర్మం కలిగినవారు ఉంటారు. ఏదైనా తిన్నా.. బ్యూటీ ఉత్పత్తులు వాడినా ముఖంపై యాక్నే, ఎరుపుదనం వచ్చేస్తుంది. అయితే, ఈ గంజినీటిలో  చర్మాన్ని రిపెయిర్‌ చేసే గుణం ఉంటుంది.

స్కిన్‌ రిపెయిర్‌..
సాధారణంగా ఆరోగ్యకరమైన చర్మం కొల్లాజెన్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ గంజి నీళ్లు కొల్లాజెన్‌ ఉత్పత్తికి  సహాయపడే గుణాలు కలిగి ఉంటుంది. ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ బారిన పడకుండా కాపాడుతుంది.

Read Also:  చలికాలంలో చర్మం పగులుతోందా? బామ్మల కాలం నాటి ఈ 5 రహస్య చిట్కాలతో మృదువైన మెరుపు!

Read Also: దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!
 

ఎవరు తీసుకోకూడదు..
ఈ గంజినీళ్లను గర్భంతో ఉన్న మహిళలు తీసుకోకూడదు. ఇందులో తక్కువ మోతాదులో ఆర్సెనిక్‌ కూడా ఉంటుంది.  చిన్న పిల్లలకు కూడా ఇవ్వకూడదు. అంతేకాదు ఇది రైస్‌తో తయారు చేస్తారు కాబట్టి డయాబెటిక్‌ వ్యాధిగ్రస్థులు కూడా తీసుకోకూడదు. గ్లూకోజ్‌ హఠాత్తుగా పెరుగుతుంది. అంతేకాదు కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఈ నీటిని తాగకూడదు. ఎప్పటికప్పుడు తయారు చేసిన నీటిని మాత్రమే తాగాలి. స్టోర్‌ చేసిన నీటిలో బ్యాక్టిరియా పెరిగే అవకాశం ఉంది. (Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Beauty Tips
Home Remedies
Telugu News