• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

Kavitha Alleges On Revanth Reddy Scams: అయ్యప్ప సొసైటీలో రేవంత్‌ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు అక్రమ దందాలు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారని తెలిపారు. ఎక్కువ దోపిడీ చేస్తే ప్రకృతి కూడా క్షమించదు.. శిక్షిస్తుంది అని రేవంత్‌ రెడ్డికి హెచ్చరించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 05, 2026, 02:18 PM IST|Updated: Nov 05, 2026, 02:21 PM IST
joinshare
Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత
Image Credit: Kavitha vs Revanth Reddy

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Rakshana Sena: 'హైదరాబాద్ నగరాన్ని రేవంత్‌ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారు. అయ్యప్ప సొసైటీలో విచ్చలవిడిగా రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారు' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ సంపాదనపైనే రేవంత్ రెడ్డి దృష్టి సారించారని తెలిపారు. కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా? రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులే లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ నగరంలో రోడ్లు, బస్తీ దవాఖానాలు, తాగునీటి ఎద్దటి వంటి వాటిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి అక్రమ సంపాదనపై దృష్టి సారించారని ఆరోపించారు. ఎటు చూసినా భూములు, పర్మిషన్లు, టీడీఆర్ పేరుతో అక్రమ దందాలే కనిపిస్తున్నాయని తెలిపారు.

'భూదాన్ ఉద్యమం స్ఫూర్తితో తెలంగాణ విద్యార్థులకు మంచి చదువు చెప్పించాలని అయ్యప్ప సొసైటీలో 150 ఎకరాలతో గురుకుల ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక అయ్యప్ప సొసైటీలోని ఖానామెట్‌లో 500 నుంచి 700 అక్రమ భవనాలు వచ్చాయి. ఇప్పుడు కూడా దాదాపు 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

'రేవంత్‌ రెడ్డి ఇంటికి దగ్గరలో ఉన్న ఖానామెట్‌లో అక్రమ భవనాలు నిర్మిస్తుంటే ఎందుకు ఆపడం లేదు?' అని కవిత ప్రశ్నించారు. 'హైదరాబాద్‌లో అక్రమంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు? వ్యాపారవేత్తలకు లైన్ క్లియర్ చేస్తూ పేదలపై ప్రతాపం చూపుతారా?' అని నిలదీశారు. అయ్యప్ప సొసైటీలో భూగర్భ జలాలు లేకపోవడంతో ఒక్క ఇటుక కూడా పేర్చవద్దని హైకోర్టు ఆర్డర్ ఉందని.. అది కాదని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సోదరులే దగ్గరుండి అనుమతులు ఇస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని.. రేవంత్‌ రెడ్డి దగ్గరుండి మరి ఈ దందా చేయిస్తున్నారని మాజీ ఎంపీ కవిత ఆరోపించారు. నిసిగ్గుగా రేవంత్‌ రెడ్డి సోదరులు అక్రమ సంపాదనకు తెగబడ్డారని మండిపడ్డారు.

'తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ అనేది జోక్‌గా మారింది. ఎవరు అడిగిన సరే సమాచారం ఇవ్వడం లేదు. ఆర్టీఐ వద్ద 18 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఆర్టీఐ ఉండి కూడా ఏం లాభం అయ్యప్ప సొసైటీకి సంబంధించి నేను అడిగే దానికి ఆర్టీఐ సమాధానం చెప్పాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

'రేవంత్ రెడ్డికి నెల రోజులు సమయం ఇస్తున్నాం. ఈలోపు అక్రమ భవనాల విషయంలో చర్యలు తీసుకోవాలి. లేదంటే మేం వెళ్లి అక్రమ భవనాలకు రెడ్ మార్క్ వేసి వస్తాం' అని కవిత హెచ్చరించారు. అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వ్యాపారులు, నోటరీతో రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. అమిత్‌ షా పర్యటనపై స్పందించిన కవిత.. 'రాష్ట్రానికి అమిత్ షా 320 మండలాల్లో కరువు ఉంటే ఆయనేదో సాయం చేస్తారని భావించాం. కానీ కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేసిందని కౌంటర్‌గా హైదరాబాద్‌లో ధర్నా చేశారు. రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఒక్క పైసా ఇవ్వలేదు గానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారంట' అని ఎద్దేవా చేశారు.

'గోదావరి, కృష్ణా నీళ్లను ఎత్తిపోయకుండా ఇప్పుడు నీళ్లు లేవని రేవంత్‌ రెడ్డి చెబుతున్నాడు. పంటలు వేయవద్దని రేవంత్ రెడ్డి చెబుతుంటే అలా చెప్పలేదని తుమ్మల చెబుతున్నాడు. అంటే వీళ్ల మధ్యే సయోధ్య లేదు. వీళ్ల కారణంగా రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Politics
Telugu News