• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

హైదరాబాద్‌ వాసులకు దీపావళి ధమాకా.. మెట్రో, ఆర్‌టీసీ కామన్‌ పాస్‌ ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ధరలు దీపావళి నుంచే అమలులోకి రానున్నాయి. మెట్రో, ఆర్‌టీసీ కామన్‌ పాస్‌ ఇకపై రూ.8500 నుంచి రూ.4500.. డైలీపాస్‌ రూ.400 నుంచి రూ.325 వరకు తగ్గనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 05, 2026, 01:48 PM IST|Updated: Nov 05, 2026, 01:53 PM IST
joinshare
హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!
Image Credit: Hyderabad Metro RTC Common Pass Price

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hyderabad Metro RTC Common Pass Price: మెట్రో-ఆర్‌టీసీ కామన్‌ పాస్‌ ధరలు తగ్గించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇది హైదరాబాద్‌ మెట్రో ప్రయాణీకులకు భారీగుడ్‌న్యూస్‌. మెట్రోతో ప్రయాణించిన వారు వారి గమ్యస్థానాలకు బస్సులో ప్రయాణించేవారికి కామన్‌ పాస్‌ అందించనున్నారు. అయితే మొదటగా రూ.8500 నెలవారీ కామన్‌ పాస్‌ ధరలుగా నిర్ణయించారు. అయితే, చాలా మంది ప్రయాణీకులు కూడా ఇది కాస్త ఖర్చుతో కూడుకుందే అనుకున్నారు. అయితే, తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఈ మెట్రో- ఆర్‌టీసీ కామన్‌ పాసులను తగ్గించాలని కీలక నిర్ఱయం తీసుకుంది. అంతేకాదు ఈ తగ్గించిన ధరలను ఈ దీపావళి నుంచే అమలు చేయనున్నారు. దీంతో ఇది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ ప్రయాణికులకు ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతుంది.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మాత్రమే కాదు.. చాలా మంది ప్రయాణీకులకు కూడా హైదరాబాద్‌లో సులభతర ప్రయాణం మెట్రో. పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా చాలామంది ప్రయాణీకులు మెట్రోనే ఎంచుకుంటారు. దీంతోపాటు సిటీ బస్సులను కూడా ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో రెండిటికీ వేర్వేరుగా కాకుండా ఒక కామన్‌ పాస్‌ ఉండాలని సీఎం రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో వేర్వేరుగా టిక్కెట్లు తీసుకుని ప్రయాణీంచాల్సిన అవసరం కూడా లేదు.. దీంతో ప్రయాణీకులకు సమయం కూడా ఆదా అవుతుంది. ఇందుకు గాను మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే పాస్ విధానాన్ని తీసుకొచ్చారు.

కామన్ పాస్ ధరలు..
మొదటగా ఈ మెట్రో-ఆర్‌టీసీ నెలవారీ కామన్ పాస్ ధరను రూ.8,500 నిర్ణయించగా, ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. సామాన్యులు,  చిరుద్యోగులు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి పాస్ తీసుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కామన్‌ పాస ధరను రూ.4,500కు తగ్గించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.అంటే రూ.4,000 వరకు తగ్గుతుంది. ఇక డైలీ పాస్ ధర కూడా రూ.400 నుంచి రూ.325కు తగ్గించనున్నారు.

Read Also: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్ యత్నం.. విదేశీ కరెన్సీతో దంపతులు అరెస్ట్.. రూ. 1.56 కోట్ల నగదు స్వాధీనం!
 

దీపావళి నుంచి కొత్త ధరలు..
తగ్గించిన ఈ మెట్రో-ఆర్‌టీసీ కామన్‌ పాస్‌ ధరలను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. అయితే పాస్ కొనుగోలు విధానం, రీఛార్జ్ ప్రక్రియ, వినియోగానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై మరింత స్పష్టత అతి త్వరలో వచ్చే అవకాశ ఉంది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Hyderabad
Telangana News
Telugu News