SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nominations: ఏపీలో 'పరిషత్‌' ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ

YSRCP TDP Huge Nominations For ZPTC And MPTC Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతుండగా.. అదే స్థాయిలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం పూర్తవగా.. ఏ పార్టీ ఎన్ని నామినేషన్లు దాఖలు చేశాయో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Oct 25, 2026, 08:06 PM IST | Updated: Oct 25, 2026, 08:12 PM IST
Image Credit: AP ZPTC MPTC Elections
Join

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా.. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో నామినేషన్లు ఎన్ని వచ్చాయనేది ఒక స్పష్టత వచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీకి దాదాపు సమానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నామినేషన్లు దాఖలు చేసింది. ఇక రెండో స్థానంలో మిత్రపక్ష జనసేన నిలవగా.. బీజేపీ నామినేషన్లు మూడో స్థానంలో ఉన్నాయి. నామినేషన్లకు సంబంధించి కీలక వివరాలు ఇలా ఉన్నాయి.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోగా.. ఆఖరు రోజు భారీగా నామినేషన్లు వచ్చాయి. అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. దాదాపు అన్నీ రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్రులు కూడా మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్లు ఎన్ని వచ్చాయనేది ఒక స్పష్టత వచ్చింది.

మొత్తం 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటికి మొత్తం 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. మొత్తం 5,724 నామినేషన్లు అభ్యర్థులు సమర్పించారు. చివరి రోజున జెడ్పీటీసీ స్థానాలకు 3,315, ఎంపీటీసీ స్థానాలకు 25,016 నామినేషన్లు రావడం గమనార్హం. ప్రాథమిక పరిశీలన అనంతరం అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు.

ఎంపీటీసీకి పార్టీలపరంగా నామినేషన్ల వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 22,013 నామినేషన్లను టీడీపీ అభ్యర్ధులు వేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు 20,556 నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన పార్టీ తరపున 4,609 మంది నామినేషన్ల సమర్పించగా.. బీజేపీ నుంచి 1,150 నామినేషన్లు వచ్చాయి.

జెడ్పీటీసీకి పార్టీలపరంగా నామినేషన్లు ఇవే..
రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరపున 2,078 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1,815 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మహా కూటమిలో భాగమైన జనసేన పార్టీ నుంచి 679, బీజేపీ తరఫున 255 నామినేషన్లు దాఖలయ్యాయి.

సీట్ల సర్దుబాటు లేకుండానే పోటీ
మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు. ఇంకా మహా కూటమి అగ్ర నేతలు పలుమార్లు సమావేశమైన ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయలనేది నిర్ణయించుకోలేదు. సూత్రప్రాయంగా జనసేన దాదాపు 15 శాతం, బీజేపీ 8 శాతం చొప్పున పోటీ చేస్తోందని తెలుస్తోంది. ఇక అత్యధికంగా టీడీపీ దాదాపు అన్నీ స్థానాల్లో పోటీకి దిగింది. పొత్తు ధర్మం పాటించకుండా మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించినట్టు పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. దాఖలు చేసిన నామినేషన్లలో ఎన్ని తిరస్కరణకు గురవుతాయో... ఎంత మంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారో.. చివరికి ఎంత మంది పోటీలో ఉంటారనేది రెండు, మూడు రోజుల్లో తేలనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES