• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Muncipal Elections Polling LIVE Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్..
Live Now

AP Muncipal Elections Polling LIVE Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్..

AP Local body elections 2026 ఏపీ వ్యాప్తంగా మున్సిపల్, కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకున్న చాలా చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం వెయ్యి కళ్లతో పర్యవేక్షిస్తోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 70మున్సిపాల్టీలు, 9 నగరపాలక పంచాయతీలకు సంబంధించిన భవితవ్యాన్ని ప్రజలు తేల్చనున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 01, 2026, 06:47 AM IST|Updated: Nov 01, 2026, 10:10 AM IST
joinshare
AP Muncipal Elections Polling LIVE Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్..
Image Credit: AP Local Body Elections
01 Nov 2026 09:03 IST (IST)
share

తూర్పుగోదావరి.... అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

తూర్పుగోదావరి.... అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మండపేటలో పోలింగ్  ప్రారంభమైన 
ఏడు గంటలకు
ముందు నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.
మహిళల సైతం ఓటు హక్కు పై చైతన్యంతో
ఉదయాన్నే క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. విద్యావంతులు... ఉద్యోగులు....
వృద్ధులు... కొత్తగా ఓట్లు వచ్చిన యువత 
ఓటు హక్కు కోసం ఆసక్తి చూపుతున్నారు. 
తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీలోని 96 వార్డుల్లో 173 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చైర్మన్ అభ్యర్థికి గులాబీ రంగు బ్యాలెట్ పైనా
కౌన్సిలర్ అభ్యర్థికి తెలుపు రంగు బ్యాలెట్ 
పైనా ఓటు వేయాల్సి ఉంది.  సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. 

60 వ డివిజన్ cvr స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మేయర్ అభ్యర్థి వంగవీటి రాధ.

01 Nov 2026 09:03 IST (IST)

చిత్తూరు జిల్లా, పలమనేరు

పలమనేరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కాగా, పోలీసుల బందోబస్తు మధ్య ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించారు. ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలమనేరు ఎస్సై రాజశేఖర్ తెలిపారు

01 Nov 2026 09:03 IST (IST)

పులివెందులలో పోలింగ్‌కు ముందే హింస

AP: కడప జిల్లా పులివెందులలో పోలింగ్ ప్రారంభానికి ముందే హింస చెలరేగింది. తెల్లవారుజామునే కొందరు అల్లరి మూకలు హల్‌చల్ చేశారు. సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద మాస్కులు ధరించి కర్రలతో రోడ్డుపై తిరిగారు. మరికొందరు రాళ్లు విసిరారు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రం లోపలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇలా చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలకు స్టేట్ ఎన్నికలను ఎన్నికల ఆఫీసులో  కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ ని  పర్యవేక్షిస్తున్న స్టేట్ ఎన్నికల ఐజి రాజకుమారి

01 Nov 2026 08:55 IST (IST)

ఐదు మున్సిపాలిటీలతోపాటు నెల్లూరు కార్పొరేషన్ కి ప్రశాంతంగా ఎన్నికలు..

నెల్లూరు కార్పొరేషన్..*
డివిజన్లు : 72
ఏకగ్రీవాలు : 8
పోలింగ్ కేంద్రాలు : 509
సమస్యాత్మక కేంద్రాలు : 126
మొత్తం ఓటర్లు : 4,89,351
వైసీపీ అభ్యర్ధి : ఆనం విజయ్ కుమార్ రెడ్డి 
టిడిపి అభ్యర్థి: రూప్ కుమార్ యాదవ్

*మున్సిపాల్టీ : ఆత్మకూరు*

మొత్తం వార్డులు: 28
ఏకగ్రీవం : 1
పురుష ఓటర్లు :12654
మహిళా ఓటర్లు :13875
మొత్తం ఓటర్లు :26529
పోలింగ్ కేంద్రాలు :30
టిడిపి అభ్యర్థి : డాక్టర్ షకీలా 
వైసీపీ అభ్యర్ధి : ఇందుమతి..

*బుచ్చి మున్సిపాలిటీ..*

మొత్తం వార్డులు : 28
ఏకగ్రీవాలు : 5
మొత్తం ఓట్లు : 36,458
పోలింగ్ కేంద్రాలు : 55
వైసీపీ అభ్యర్థి: షకీలా బేగం
టిడిపి అభ్యర్థి: దొడ్ల విజయలక్ష్మి

*మున్సిపాల్టీ :  సూళ్లూరుపేట*

మొత్తం వార్డులు..32
ఏకగ్రీవాలు : 2
పురుష ఓటర్లు :17178
మహిళా ఓటర్లు :18336
ఇతరలు.......05
మొత్తం ఓటర్లు :35519
పోలింగ్ కేంద్రాలు :55
టిడిపి అభ్యర్థి...పిట్ల సుహాసిని 
వైసీపీ అభ్యర్ధి :మోడీ విమల కుమారి

*మున్సిపాల్టీ : నాయుడుపేట*

మొత్తం వార్డులు..32
పురుష ఓటర్లు :17648
మహిళా ఓటర్లు :19448
మొత్తం ఓటర్లు :37100
పోలింగ్ కేంద్రాలు:62
టిడిపి అభ్యర్థి: షేక్ షాకీరా 
వైసీపీ అభ్యర్ధి :తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

*మున్సిపాలిటీ : వెంకటగిరి*

మొత్తం వార్డులు : 36
పురుష ఓటర్లు : 21,222
మహిళా ఓటర్లు : 22,916
ఇతరులు : 2
మొత్తం ఓటర్లు : 44,140
పోలింగ్ కేంద్రాలు : 66
టిడిపి అభ్యర్థి : దొంతు శారద (చైర్మన్)
వైసీపీ అభ్యర్ధి : బొలిగల దీవెన (చైర్మన్)

01 Nov 2026 08:55 IST (IST)

తిరుపతి జిల్లా – పోలీసుల విస్తృత తనిఖీలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో వాహన తనిఖీలు ముమ్మరం.

ప్రధాన రహదారులు, కీలక కూడళ్లలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు.

అక్రమ నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా.

ఇతర నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు.

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు తావులేకుండా పోలీసుల పర్యవేక్షణ.

ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం.

01 Nov 2026 08:59 IST (IST)

మదనపల్లె 16వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా మదనపల్లె..

మదనపల్లె CSI గర్ల్స్ హైస్కూల్‌లోని 16వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్లను అనుమతించడం లేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బూత్ ఏజెంట్లను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తూ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింక వెంకట చలపతి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో జింక వెంకట చలపతిని పోలీసులు పోలింగ్ కేంద్రం వెలుపలికి పంపించే ప్రయత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆయనను బయటకు నెట్టివేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

పోలింగ్ కేంద్రంలో బూత్ ఏజెంట్ల అనుమతి విషయంలో నెలకొన్న వివాదంపై ఎన్నికల అధికారులు స్పందించాలని, నిబంధనల ప్రకారం అన్ని పార్టీల ఏజెంట్లకు సమాన అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరుతున్నారు.

01 Nov 2026 09:00 IST (IST)

కడప జిల్లా పులివెందుల వెంకట్ రెడ్డి మెమోరియల్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ దాడులు

 కవరేజ్ కోసం వెళ్ళిన ఎన్టీవీ ప్రతినిధి సురేష్ పై టీడీపీ శ్రేణుల దాడి

- పోలింగ్ బూత్ వద్ద పోలీసుల మధ్యే ఉన్నా ఎన్టీవీ ప్రతినిధి సురేష్ ఫోన్ పగలకొట్టి, చొక్కా చించి దాడి చేసిన టీడీపీ శ్రేణులు

- పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండటానికి వీల్లేదని హుకుం.

01 Nov 2026 08:55 IST (IST)

చిత్తూరు కుప్పంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌

పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు.

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు.

ముందస్తుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న వివిధ పార్టీల బూత్ ఏజెంట్లు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల చర్యలు.

పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పోలీసుల నిరంతర పర్యవేక్షణ.

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.

ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు.

పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పార్టీలకు పోలీసుల సూచనలు.

పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారుల సమన్వయం.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందస్తు ఏర్పాట్లు.

కుప్పం మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ.

పోలింగ్ వద్ద ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు

పోలింగ్ కేంద్రాలకుఇప్పుడే ఓటు వేసే దానికి ఓటర్లు బూతు దగ్గరికి వస్తున్నారు

01 Nov 2026 08:54 IST (IST)

అమరావతి: నేడు తొలిదశ స్థానిక పోరు

- 92 పట్టణ స్థానిక సంస్థలకు  ప్రారంభం కానున్న పోలింగ్

- 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు

- ఉ. 7 నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్

- ఈసారి ప్రత్యక్ష విధానంలో బరిలోకి దిగుతున్న మేయర్లు

- ఇప్పటికే 17 మున్సిపల్ చైర్మన్లు, మేజర్ పంచాయతీలలో కూటమి ఏకగ్రీవం

- టీడీపీకి 15 చైర్‌పర్సన్ స్థానాలు, జనసేన 1, బీజేపీ 1

- 8 చోట్ల చైర్‌పర్సన్ సహా కౌన్సిలర్లు ఏకగ్రీవం, 922 కార్పొరేషన్ డివిజన్లలో 118 ఏకగ్రీవం

- మున్సిపల్ ఎన్నికల విధులకు 36 వేలకు పైగా సిబ్బంది

- పలు జిల్లాల్లో 671 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, మరో 1,233 సున్నిత కేంద్రాల్లో 4,943 మంది సిబ్బంది ప్రత్యేక నిఘా

- డ్రోన్లు, సీసీ కెమెరాలు నిరంతరం పర్యవేక్షణ

- రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ సిద్ధం

- పోలింగ్‌కు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు

- స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న  ఎన్నికల సంఘం

- నవంబర్ 3న ఓట్ల లెక్కింపు

- ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 261 కేసులు నమోదు

- లక్షా 5 వేల మందికి పైగా బైండోవర్,107 మంది అరెస్ట్, 733 మందికి నోటీసులు

- 2,726 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Chandrababu Naidu
TDP
YCP

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
గురు నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు!

గురు నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు!

2

బుధుడి అనుగ్రహంతో ఈ 4 రాశులకు జాక్‌పాట్.. నవంబర్‌లో డబ్బే డబ్బు!

3

పండగ ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర..!!

4

Balakrishna: పనిచేసే వారికి ఓటెయ్యాలి.. హిందూపురంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

5

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ఠ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Muncipal corporation Elections 2026: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మొత్తంగా 11705 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగుతోంది. ఈ సారి బ్యాలెట్ బాక్సులతో స్థానిక సమరం జరుగుతోంది. ఈసారి కార్పోరేషన్ ఎన్నికల్లో నగర ఓటర్లు కార్పొరేటర్లను,మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను.. మేయర్, మున్సిపల్ ఛైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వానా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కౌన్సిలర్లు.. కార్పోరేటర్స్ , మున్సిపల్ చైర్ పర్సన్స్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా 36వేల 351 మంది పోలీసు సిబ్బందితో ఎన్నికలపై నిఘా ఉంటారు.  4వేల 372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 671 అత్యంత సమస్యాత్మక పోలింగ కేంద్రాలపై సీసీ టీవీ కెమెరాలతో  నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు.  ఇప్పటికే 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించారు.