SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: బ్రహ్మోత్సవాల్లో వడ్డీకాసులవాడికి కనకవర్షం.. 8 రోజుల్లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం

8 Days 26 Crores Hundi Collections in Tirumala Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలు ముగిసిపోగా.. 8 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. దాదాపు ఏడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం దాదాపు రూ.26 కోట్లకు చేరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 20, 2026, 02:35 PM IST | Updated: Oct 20, 2026, 02:42 PM IST
Image Credit: Tirumala Brahmotsavams
Join

Tirumala Brahmotsavams: కలియుగ వైకుంఠవాసుడు.. తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిపోయాయి. అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భక్త కోటి స్వామిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆపద మొక్కులవాడికి మొక్కులు చెల్లించుకున్నారు. 8 రోజుల పాటు కొనసాగిన నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అశేష స్థాయిలో భక్తులు తరలిరాగా.. అదే స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు ప్రెస్‌మీట్ నిర్వహించి వెల్లడించారు. తిరుమలలో విజయవంతంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయని ప్రకటించారు. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఎన్నడూ లేని విధంగా ఏర్పాటుచేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. భారీ వర్షాలతో కొంత ఇబ్బంది కలిగినా అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు వాహన సేవలను దర్శించుకున్నారని వివరించారు. అధికారులు, సిబ్బంది వర్షంలోనే తడుస్తూనే భక్తులకు సదుపాయాలు కల్పించారు.

బ్రహ్మోత్సవాలు కొనసాగిన 8 రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీకి భారీగా ఆదాయం లభించింది. హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.25.79 కోట్లు ఆదాయం వచ్చింది. 22.60 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించగా.. 2.44 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 34.34 లక్షల లడ్డూల విక్రయం జరిగాయని టీటీడీ చైర్మన్‌ నాయుడు తెలిపారు.

'గరుడసేవ రోజున వర్షంలోనూ భక్తులకు నిరంతర సేవలందించారు. 26 రాష్ట్రాలు, ఖతర్, దుబాయ్ నుంచి 6,777 మంది కళాకారుల ప్రదర్శనలు జరిగాయి. ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉత్తమ ప్రదర్శనలు చేసిన 4 కళాబృందాలను  గుర్తించి సత్కరించాం. తిరుమలలో 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేశాం. వాహన సేవల కోసం 36 భారీ డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటు చేశాం' అని నాయుడు వివరించారు.

'39 ఎలక్ట్రిక్ బస్సులు ద్వారా సుమారు 7 లక్షల మంది భక్తులకు తిరుమలలో ఉచిత రవాణా సదుపాయం కల్పించాం. 4,500 మంది శ్రీవారి సేవకుల విశేష సేవలందించారు. 75 మంది వైద్యులు, 20 అంబులెన్సులతో వైద్య సేవలు అందించాం. 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బందితో బ్రహ్మోత్సవాలకు భద్రత కల్పించారు. గరుడసేవ రోజున 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అందించారు' అని టీటీడీ చైర్మన్‌ నాయుడు వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES