• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్‌ మీనాక్షి, ఇతర ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్‌ మీనాక్షి, ఇతర ప్రముఖులు

Meenakshi Choudary And Other VIPs Visits To Tirumala: బ్రహ్మోత్సవాల అనంతరం తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వారాంతం ముగిసిన తర్వాతి రోజు సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. హీరోయిన్‌ మీనాక్షి చౌదరి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 28, 2026, 08:10 PM IST|Updated: Sep 28, 2026, 08:17 PM IST
joinshare
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్‌ మీనాక్షి, ఇతర ప్రముఖులు
Image Credit: Tirumala VIPs Visits

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirumala VIPs Visit: బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం తిరుమల ఆలయానికి భక్తుల సంఖ్య పెరిగింది. సాధారణ భక్తులతోపాటు పలు రంగాల ప్రముఖులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పలువురు ప్రముఖలు తిరుమల వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. సినీ రంగ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు తిరుమల క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున సామాన్య భక్తులు దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు నారా రోహిత్‌ శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కూడా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్‌ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామిని దర్శించుకోగా.. వారికి రంగనాయక మండపంలో వేద పండితులు ఘనంగా ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలతో పాటు శేషవస్త్రాలను అందజేశారు.

సుప్రభాత సేవలో హీరోయిన్‌
శ్రీవారిని సుప్రభాత సేవ సమయంలో సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున జరిగిన సుప్రభాత సేవ సమయంలో ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మీనాక్షి చౌదరి 'శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా. తిరుమల రావడం, శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతినిస్తుంది' అని మీనాక్షి చౌదరి తెలిపారు.

ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉత్సవాలు ముగిసిన తర్వాత తొలి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలను సందర్శించారు. నిన్న శ్రీవారిని మొత్తం 83,578 భక్తులు దర్శించుకోగా.. 31,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.5.07 కోట్ల ఆదాయం లభించగా.. 4.39 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. అన్నప్రసాదం 2.88 లక్షల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్‌ కొనసాగుతోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
TTD News
Tollywood
Tirupathi
Spirituality