• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Panchayat Elections: తిరుపతి జిల్లాలో 'పంచాయతీ' పోరుకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లు ఇలా

Panchayat Elections: తిరుపతి జిల్లాలో 'పంచాయతీ' పోరుకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లు ఇలా

All Set To Panchayat Elections In Andhra Pradesh: పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కగా.. తొలి విడత పోలింగ్‌ కు సంబంధించి తిరుపతి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 22, 2026, 07:27 IST|Updated: Nov 22, 2026, 07:48 IST
joinshare
Panchayat Elections: తిరుపతి జిల్లాలో 'పంచాయతీ' పోరుకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లు ఇలా
Image Credit: AP Panchayati Elections

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sarpanch Elections: మున్సిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాజకీయం హాట్ హాట్ గా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా ఈనెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం, ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మున్సిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో చెలరేగిన వివాదం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తవగా.. తిరుపతి జిల్లాలో ఏర్పాట్లు ఎలా జరిగాయో పరిశీలిద్దాం.

తిరుపతి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 404 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. 136 సర్పంచ్ స్థానాలు, 2,088 వార్డు సభ్యులు ఏకగ్రీవమవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. తిరుపతి జిల్లాలో 268 సర్పంచ్ స్థానాలకు.. 1,596 వార్డు స్థానాలకు పోలింగ్ రేపు జరగనుంది. పోలింగ్‌ జరిపేందుకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది.

తిరుపతి జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 404 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ పదవులకు, 3,684 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 136 సర్పంచ్ స్థానాలు, 2,088 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 132 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 268 సర్పంచ్ స్థానాలకు, 1,596 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే శ్రీకాళహస్తి పరిధిలో 125 పంచాయతీలకు గాను 69 ఏకగ్రీవం కాగా.. 56 సర్పంచ్ స్థానాలకు, 294 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. సత్యవేడు పరిధిలో 180 పంచాయతీలకు గాను 45 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 41 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 135 సర్పంచ్ స్థానాలకు, 727 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కోడూరు పరిధిలో 99 పంచాయతీలకు గాను 22 ఏకగ్రీవం కాగా 77 సర్పంచ్ స్థానాలకు, 575 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. మండలాల వారీగా శ్రీకాళహస్తిలో 39 సర్పంచ్ స్థానాల్లో 29, తొట్టంబేడులో 27 స్థానాల్లో 19, ఏర్పేడులో 40 స్థానాల్లో 17 ఏకగ్రీవాలు నమోదయ్యాయి. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
Telugu News
AP News
Andhra Pradesh
Tirupathi