Tirumala: తిరుమల నడక మార్గంలో పెను విషాదం.. ఎన్నారై భక్తుడు మృతి.. కారణం ఏమిటంటే..?..
Srivari mettu route in Tirumala: నడక మార్గంలో భక్తుడు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. పీసీఆర్ చేసిన లాభంలేకుండా పోయింది.
Nri dies with heart attack in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా మంది భక్తులు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్తుంటారు. కొంత మంది ప్రత్యేకంగా నడిచి వస్తామి స్వామి వారికి మొక్కులుమొక్కుకుంటారు. ఇంకొంత మంది నేరుగా రోడ్డు మార్గంలో తమ సొంత వాహనాలు లేదా టీటీడీ ఏర్పాటు చేసిన బస్సుల్లో కొండపైకి చేరుకుంటారు. అయితే ముఖ్యంగా నడక మార్గంలొ తిరుమలకు వెళ్లే వారు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యసమస్యలున్న వారు పలు జాగ్రత్తలు తీసుకొవాలని టీటీడీ తరచుగా సూచిస్తుంది. ఈ క్రమంలో తాజాగా..తిరుమల మెట్టు మార్గంలో ఒక ఎన్నారై అపస్మారక స్థితిలోకి వెళ్లి దుర్మరణం చెందాడు.
ఈ ఘటనతో భక్తులు షాక్ కు గురయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న చిత్తూరుకు చెందిన ఎన్ ఆర్ ఐ భక్తులు సింగిరెడ్డి సుర్జిత్ రెడ్డి ఒక్కసారిగా మెట్ల మీద కుప్పకూలీపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్న వారు పీసీఆర్ చేశారు.
అదే విధంగా టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. టీటీడీ వైద్య సిబ్బంది వచ్చి పరీక్షలు చేసి చూసి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. గుండెపోటుతో ఎన్నారై తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అంబులెన్స్ ను రప్పించి ఎన్నారై డెడ్ బాడీని అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తిరుమల మెట్ల మార్గంలో తీవ్ర విషాదకరంగా మారింది.