Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు అనగా నవంబర్ 5వ తేదీన సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో రేపు సాయంత్రం 4గంటలకు ఈ భేటీ జరగనుంది. సమావేశానికి ముందు మధ్యాహ్నం 3గంటలకు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, పలు శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
కేబినెట్ అజెండాపై సీఎస్ సమీక్ష:
ఈ మంత్రివర్గ భేటీ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. పలు ప్రభుత్వ శాఖల నుంచి అందిన అజెండా ప్రతులు, చర్చించాల్సిన అంశాలు.. ప్రతిపాదిత బిల్లులను సీఎస్ పరిశీలించారు. మంత్రివర్గం ముందుకు తీసుకురావాల్సిన ప్రతిపాదనలపై అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
పలు కీలక అంశాలపై చర్చ:
ఇక ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల భర్తీ, ఉద్యోగ నియామకాలు, బడ్జెట్ కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు శాఖ పనితీరు, ప్రభుత్వ హమీల అమలు తీరుపై కూడా మంత్రి వర్గం సమీక్షించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా తీసుకోవాల్సిన చర్యలు కూడా కేబినెట్ అజెండాలో ఉండే ఛాన్స్ ఉంది.
ఇక అటు పారిశ్రామిక ప్రాజెక్టులకు కూడా భూకేటాయింపులు, కొత్త పరిశ్రమలకు అనుమతులు వంటి ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read: