Tirupati Corporation: తిరుపతిలో 'అధికార కూటమి' క్లీన్‌స్వీప్.. 2 స్థానాలకే వైఎస్సార్‌సీపీ పరిమితం
NDA Bags Tirupati Municipal Corporation YSRCP Won 2 Divisons Only: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అధికార కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. రెండు స్థానాలకే పరిమితమవగా.. మిగతా అన్నీ డివిజన్‌లలో టీడీపీ, జనసేన, బీజేపీలు గెలిచాయి. తిరుపతి కార్పొరేషన్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
YSRCP Won 2 Divisons Only: హోరాహోరీగా జరగాల్సిన ఏపీ మున్సిపల్ ఎన్నికలు కొన్ని పరిణామాలతో ఏకపక్షంగా సాగాయి. అధికార కూటమి వేసిన వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షం అసలు పోటీలోనే లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో నేడు వెలువడిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. అన్నీ మున్సిపల్ కార్పొరేషన్లు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి. మిత్రపక్షాలు బీజేపీ, జనసేన పార్టీతో కలిసి టీడీపీ దక్కించుకుంది. ఇక ఆధ్యాత్మిక నగరి అయిన తిరుపతిలో కూటమి విజయ ధుంధుబి మోగించింది.
తిరుపతి నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్)లో మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అధికార తెలుగుదేశం పార్టీ 56 డివిజన్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షం జనసేన పార్టీ ఆరు డివిజన్లు సొంతం చేసుకోగా.. మరో మిత్రపక్షం బీజేపీ ఒక స్థానంలో గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల గెలిచారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలాచోట్ల కూటమికి పోటీలో నిలబడలేదు. తిరుపతి కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ రెండు డివిజన్లు కైవసం చేసుకుంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన మన్నె శ్రీనివాస ప్రసాద్ విజయం సాధించారు. దీంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌ను కూటమి ఖాతాలో వేసుకుంది.
కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి కార్పొరేటర్లు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. తిరుపతి నగర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ప్రకటించారు.
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయం సాధించిన కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఓటర్లకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కేవలం రాజకీయ పార్టీలది మాత్రమే కాదని.. తిరుపతి ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని గెలిచిన కార్పొరేటర్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని కూటమి కార్పొరేటర్లు తెలిపారు. తమ తమ వార్డుల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, పార్కుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మురుగునీటి కాలువల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, చెత్త నిర్వహణ, తాగునీటి సరఫరా మెరుగుదలకు అధికారులతో సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని కార్పొరేటర్లు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై ప్రజలు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.