• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /AP MPTC ZPTC Elections 2026: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హింసాత్మకం.. పెట్రోల్ బాంబులతో దాడులు

AP MPTC ZPTC Elections 2026: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హింసాత్మకం.. పెట్రోల్ బాంబులతో దాడులు

MPTC ZPTC Elections Updates: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ తిరుపతి, కడప జిల్లాల్లో హెటెన్షన్ నెలకొంది. పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులకు దిగాయి. పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లోనూ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

Written ByAshok Krindinti
Published: Nov 05, 2026, 12:41 PM IST|Updated: Nov 05, 2026, 12:42 PM IST
joinshare
AP MPTC ZPTC Elections 2026: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హింసాత్మకం.. పెట్రోల్ బాంబులతో దాడులు
Image Credit: MPTC ZPTC Elections Updates

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

MPTC ZPTC Elections Updates: ఆంధ్రప్రదేశ్‌లో ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ వేళ తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వేకోడూరు పరిధిలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెట్రోల్ బాంబుల దాడులకు దారితీసింది. మరోవైపు కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. పులివెందులలో నియోజకవర్గ పరిధిలోని ఎర్రిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌ల దగ్గర టీడీపీ పెట్రోల్ బాంబులు వేయడంతో భారీ మంటలు చెలరేగినట్లు సమాచారం. బాంబులతో ఒకరిపై ఒకరు దాడి తెలుస్తోంది. ఓటర్లను అడ్డుకోవడం, పోలింగ్ ఏజెంట్ల ప్రవేశం వంటి అంశాలపై ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం పెట్రోల్ బాంబులతో దాడులకు దిగారు. ఒక్కసారిగా దాడులు జరగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. పెట్రోల్ బాంబుల ఘటనతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఘర్షణ కారణంగా గ్రామంలో సాధారణ జనజీవనం సైతం స్తంభించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో అదనపు బలగాలను మోహరించాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

పులివెందులలో ఇలా..

మరోవైపు వైఎస్సార్ కడప జిల్లాలోనూ పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి. కొత్తపల్లె మండలం మోటునూతలపల్లెలో ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న మహిళలు, సాధారణ ఓటర్లను కూడా అడ్డుకున్నారంటూ ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ వైసీపీ వర్గాలు ఆరోపించాయి.
పులివెందుల మండలం ఎర్రిపల్లిలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారంటూ వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పెట్రోల్ బాంబులు వేసినట్లు తెలుస్తోంది. వేముల మండలంలో ఓటరు స్లిప్పులను టీడీపీ శ్రేణులు బలవంతంగా తీసుకుంటున్నాయంటూ వైసీపీ ఆరోపించింది.

లింగాల మండలం పార్లపల్లి పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ఏజెంట్ల ప్రవేశం వివాదానికి కారణమైంది. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లపల్లికి చేరుకున్నారు. అయితే స్థానికేతరులకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎంపీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీని అడ్డుకోవడంతో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం గుండ్లకుంటలోనూ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో మొదలైన వివాదం ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
AP News
Telugu News