TTD Update: తిరుమల దర్శనానికి వచ్చే భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శిలా తోరణం వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇక నిన్న శ్రీవారిని 66 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు తెలిపారు. టోకెన్ లేని భక్తులకు ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారి హుండీ ద్వారా 4 కోట్ల 44 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. లడ్డూ విక్రయాల ద్వారా 4.23 లక్షల ఆదాయం సమకూరింది.అన్న ప్రసాదాన్ని 2.25 లక్షల మంది స్వీకరించినట్టు తెలిపారు.ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు సర్వదర్శనం కోసం SSD టోకెన్‌లు లేకుండా 15 - 20 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
రేపటి నుంచి పితృ పక్షాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గే అవకాశాలున్నాయి. ఈ రోజు, రేపు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఇక శరన్ నవరాత్రిలు సమయంలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సారి అధిక మాసం సందర్భంగా తిరుమలలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి.