• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Vijay Sai reddy: జగన్ క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారు.!. విజయసాయిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..

Vijay Sai reddy: జగన్ క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారు.!. విజయసాయిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..

Vijay sai reddy fires on ap govt: తిరుమల లడ్డు వివాదంపై విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు కల్తీయే జరగలేదని నివేదికలు ఇచ్చాయన్నారు. అధికారంలో ఉండి తిరుమల లడ్డుపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 08, 2026, 12:43 PM IST|Updated: Oct 08, 2026, 12:55 PM IST
joinshare
Vijay Sai reddy: జగన్ క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారు.!. విజయసాయిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: vijayasaireddyspeechintirupati

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

2

Success Story: రూ.50 వేలతో ప్రయాణం.. కష్టాలను జయించి.. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సృష్టించిన తెలుగు ఇంజనీర్ సక్సెస్ స్టోరీ

3

Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..

4

దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!

5

Mandaadi Box Office: సూరి, సుహాస్‌కు ఊహించని బ్లాక్‌బస్టర్.. మండాడి కలెక్షన్లు ఎంతో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijaya sai reddy fires on ap cm Chandrababu naidu and ys jagan: మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఏపీ కూటమి ప్రభుత్వంతో పాటు వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు. చంద్రబాబు నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని నిరాధార ఆరోపణలు చేయడం  ఏంటని ధ్వజమెత్తారు. ఇటీవల నివేదికలు మాత్రం జంతుకొవ్వు కలవలేదని నివేదికలు ఇచ్చిన విషయంపై కూటమిపై తీవ్రంగా స్పందించారు. 

 

జగన్, నువ్వు క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారు.. హిందూ మతంలోకి మారి జగన్ మోహన్ రెడ్డి అని పెట్టుకో. మతం మారిన నువ్వు రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు? https://t.co/Bwwy7m3WLp

— greatandhra (@greatandhranews) October 8, 2026

 

చంద్రబాబు ఎప్పుడు సీఎం అయిన కరువు తాండవిస్తుందని, తొక్కిసలాటలు జరుగుతాయని సెటైర్లు వేశారు. అదే విధంగా కొత్తగా పెట్టబోయే వ్యాఖ్యలపై కూడా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. అన్ని మతాలను, కులాలను కలుపుకుని పోతామని క్లారిటీ ఇచ్చారు. 

ఏపీలో టీడీపీ మొదటి స్థానంలో, కూటమి రెండొ ప్లేస్ లో, మూడో స్థానంలో తాము పెట్టబోయే పార్టీ ఉంటుందని వెల్లడించారు. అటు అధికర కూటమితో పాటు, మరోవైపు అపోసిషన్ పార్టీతో కూడా  ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.  ముఖ్యంగానెయ్యి వివాదంలో గత ప్రభుత్వం.. రూ. 320 నుంచి రూ. 400 వరకు కొనుగోలు చేసిందన్నారు. అయితే స్వచ్చమైన నెయ్యి బహిరంగ మార్కెట్ లో ఏకంగా రూ. 1000 కిపైగానే ఉంటుందని తెలిపారు. 

ఇప్పుడు కూటమి ప్రభుత్వం కిలో నెయ్యి రూ.658 చొప్పున కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. అదే విధంగా తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని మాట్లాడారు. ఇదే క్రమంలో మాజీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. జగన్, నువ్వు క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారు అంటూ సెటైర్లు వేశారు. 

హిందూ మతంలోకి మారి జగన్ మోహన్ రెడ్డి అని పెట్టుకోవాలంటూ కౌంటర్ వేశారు. మతం మారిన నువ్వు రెడ్డి అని ఎలా పెట్టుకుంటావంటూ జగన్ కు ప్రశ్నలు సంధించారు. అంతే కాకుండా కొంత మంది క్రిస్టియన్ నేతలు హిందు ఆలయాలకు వస్తారని, కండువాలు కప్పుకుంటారని, కానీ తీర్థం ఇస్తే చేతి వేళ్ల మధ్యలో నుంచి జారీపడిపోయేలా చేస్తారని అన్నారు.చేతికి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత తీసుకుంటామని చెప్పి వాటిని పక్కన పడేస్తారని జగన్ ను ఇన్ డైరెక్ట్ గా విమర్శించారు. 

అదే విధంగా  సర్ ప్రక్రియపై కూడా స్పందించారు. నిజమైన పౌరుడి ఓటు తొలగిస్తే తప్పే.. కానీ డూప్లికేట్ ఎంట్రీలు, అక్రమంగా సెటిల్ అయిన వారి పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడంలో తప్పు లేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా నుంచి వచ్చి ఇక్కడ గ్రామాల్లో నివసిస్తున్నారు.. మన రాష్ట్రంలో ఒరిజినల్‌గా ఉన్న మన పౌరులు మైనారిటీలో పడిపోయే పరిస్థితి ఉత్పన్నమవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Tirupathi
Chandrababu Naidu