• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /వంగవీటి రాధాకృష్ణ కొత్త పొలిటికల్ జర్నీ.. ఈ సారైనా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!!

వంగవీటి రాధాకృష్ణ కొత్త పొలిటికల్ జర్నీ.. ఈ సారైనా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!!

Vangaveeti Radha krishna New Political Journey : విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరిక ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇన్నాళ్లు తెలుగు దేశంపార్టీలో ఉన్న వంగవీటి రాధా కృష్ణ తనకంటూ రాజకీయ గుర్తింపు పెద్దగా లేదని మదనపడుతున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికలు మంచి వేదికగా మారాయి. ఇప్పటిదాకా వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ… పరిస్థితులు అనుకూలించలేదు. రాజకీయ పరిణామాలు కలిసి రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కీలక పదవి చేపట్టేందుకు మున్సిపల్ ఎన్నికలు కలిసిసొచ్చాయనే ఆయన అనుచరులు భావిస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 06:22 AM IST|Updated: Oct 18, 2026, 06:23 AM IST
joinshare
వంగవీటి రాధాకృష్ణ కొత్త పొలిటికల్ జర్నీ.. ఈ సారైనా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!!
Image Credit: Vangaveeti Radha krishna (X /Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రణబాలి 2 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ముందు కొండంత టార్గెట్..

రణబాలి 2 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ముందు కొండంత టార్గెట్..

2

సినిమాల్లో మొదలైన ఫ్రాంచైజీలు ట్రెండ్.. వరుసగా అదే బాటలో మేకర్స్..

3

Elnino Effect: పండగ వేళ బిగ్ షాక్.. సెంచరీకి చేరువలో బియ్యం ధరలు.. సామాన్యులు లబో దిబో..

4

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఆలయంలో దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

5

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వం కిం కర్తవ్యం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vangaveeti Mayor Candidate::సీట్ల సర్థుబాటుతో విజయవాడ స్థానం జనసేన పార్టీ ఖాతాలోకి వెళుతుందని ముందే పసిగట్టిన వంగవీటి రాధా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న విజయవాడలో వంగవీటి రాధకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనసేన పార్టీలో చేరడం, మరుసటి రోజే విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇన్నాళ్లు రాజకీయంగా గుర్తింపు లేదని మదనపడుతున్న వంగవీటి రాధ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. జనసేన నాయకుడిగా ప్రజల్లో నిత్యం తిరిగుతూ సమస్యల పరిష్కానికి బాధ్యత తీసుకుంటామని వంగవీటి రాధా అన్నారు.

మున్సిపస్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ ప్రజలు ఆదరిస్తే.. రాజకీయల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ.. తన తండ్రి దివంగత వంగవీటి మోహనరంగా పేరును నిలబెడుతారని ఆయన అనుచరులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

విజయవాడ వేదికగా రాజకీయాలు.. 
విజయవాడ వేదికగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందేందుకు ఆయనకు అవకాశాలు కలిసి రాలేదు. అయితే గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఆయన పనిచేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ దక్కలేదు.

కూటమి విజయవాడ మేయర్ అభ్యర్ధిగా జనసేన తరుపున పోటీ.. 
తాజాగా జనసేనలో చేరడంతో విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధాకృష్ణ విపక్షానికి గట్టి పోటీ ఇవ్వగలడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించండంతో విజయవాడ రాజకీయాల్లో జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వంగవీటి రాధా చేరిక రాజకీయాల్లో చర్చకు దారితీసింది. వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కీలక పదవులు లభిస్తాయనే అంచనాలు ఉన్నప్పటికీ అవి నెరవేరలేదనే చర్చ ఆయన అనుచరుల్లో ఉందని రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు సాధిస్తే… రాజకీయ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దుకుంటారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

రాజకీయ ప్రయాణం.. 

వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణంలో పార్టీ మార్పులు, ఎన్నికల్లో ఓటములు, పోటీ చేసే నియోజకవర్గంపై భిన్నాభిప్రాయాలు కీలక పరిణామాలుగా నిలిచాయి. మరోవైపు, ఆయన తండ్రి వంగవీటి మోహన రంగా వారసత్వం, విజయవాడలో ఉన్న అనుచరగణం ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. మేయర్ ఎన్నికల్లో అభ్యర్థి వ్యక్తిగత ప్రజాదరణతో పాటు పార్టీ బలం, స్థానిక నాయకుల మద్దతు, కూటమి పార్టీల మధ్య సమన్వయం కూడా ప్రభావం చూపుతాయి. వంగవీటి రాధాకృష్ణ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మా, దివంగత నేత వంగవీటి మోహన రంగాకున్న మంచిపేరు ఓట్లను భారీగా రాబట్టుకుని, విజయవాడ మేయర్ పీఠంపై జనసేన జెండా ఎగురవేస్తామనే ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Vijayawada
AP News
Pawan Kalyan
TDP