• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వం కిం కర్తవ్యం..!!

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వం కిం కర్తవ్యం..!!

El Nino Effect Telangana: ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్ నినో.. తెలంగాణపై ప్రభావం చూపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన నీటి ఎద్దడి, విద్యుత్తు సమస్యలు తలెత్తున్నాయి. రాబోయే ప్రతికూల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి అధికార యంత్రాంగం సమాయాత్తమైంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 06:50 AM IST|Updated: Oct 18, 2026, 06:51 AM IST
joinshare
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వం కిం కర్తవ్యం..!!
Image Credit: El nino Effect On Telangana (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రణబాలి 2 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ముందు కొండంత టార్గెట్..

రణబాలి 2 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ముందు కొండంత టార్గెట్..

2

సినిమాల్లో మొదలైన ఫ్రాంచైజీలు ట్రెండ్.. వరుసగా అదే బాటలో మేకర్స్..

3

Elnino Effect: పండగ వేళ బిగ్ షాక్.. సెంచరీకి చేరువలో బియ్యం ధరలు.. సామాన్యులు లబో దిబో..

4

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఆలయంలో దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

5

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం.. ప్రభుత్వం కిం కర్తవ్యం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

El Nino Effect:  జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తెలంగాణలో మాములుగా కురవాల్సిన  740.6 మి.మీ వర్షపాతానికి బదులుగా కేవలం 615.5 మి.మీ మాత్రమే కురిసినట్టు వాతావరణ శాక అధికారులు తెలిపారు. సుమారుగా 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయింది. తెలంగాణలో 33 జిల్లాల్లో 18 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నెలకొంది.వర్షాలు సరిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గాయి.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగాయి. రాబోయే ఫిబ్రవరి నాటికి ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు  వెల్లడించారు.

ఖరీఫ్  సీజన్‌లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రబీ సీజన్‌లో నీటి కష్టాలు ఎదురవుతుండటంతో, నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు (పప్పుధాన్యాలు, నూనెగింజలు) సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది.

రాబోయే నెలల్లో తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో సరఫరాపై కూడా ఒత్తిడి పడుతోంది.

నిరంతర విద్యుత్..

పంటలు చేతికొచ్చే వరకు రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రాబోయే 8 నెలల పాటు పరిస్థితి కీలకం కాబట్టి, తాగునీరు మరియు వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు.విద్యుత్ అంతరాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే జూన్ వరకు అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, గ్రామసభలు, కళాజాతల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

వర్షాభావ పరిస్థితులు.. 

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు కొనసాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరాకు పలుమార్లు ఆదేశించినప్పటికీ పరిస్థితి ఎందుకు మెరుగుపడటం లేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తి పెంపునకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఫైరయ్యారు. నైనీ, మహానది బొగ్గు సరఫరా ఏర్పాట్లు చేసినప్పటికీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ముఖ్యమంత్రి. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ అందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కోవిడ్ తరహా విపత్తుగా ఎల్‌ నినో..

ఎల్‌నినో ప్రభావాన్ని కొవిడ్ తరహా విపత్తుగా పరిగణించి అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితులను సాధారణ సమస్యగా తీసుకుంటే.. అవి భవిష్యత్తులో తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వర్షాలు తిరిగి కురిసే వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి శాఖ వచ్చే ఏడాది జూన్ వరకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సమస్యలను ముందుగానే అంచనా వేసి శాఖల మధ్య సమన్వయంతో పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి కొరత..

వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగం, ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులకు మేత కొరత ఏర్పడకుండా పశుగ్రాసం నిల్వలు, సరఫరాపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్-1, గ్రూప్-2 స్థాయి అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షపాతం, వ్యవసాయ విద్యుత్, తాగునీరు, పంటల పరిస్థితి, పశుగ్రాసం వంటి అంశాలను నిరంతరం పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికలు అందించేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావం, రాబోయే సవాళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దసరా తర్వాత దీపావళి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, వర్షాలు తిరిగి వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telangana Weather
Revanth Reddy