Ranabaali Box Office Dandayatra: గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేదు. ఇక పెళ్లి తర్వాత తన జీవిత భాగస్వామి రష్మిక మందన్న జోడి కట్టడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా, తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టింది. కెరీర్ పరంగా రణబాలి విజయ్‌కు ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు రౌడీ హీరో.
చారిత్రక నేపథ్యం.
చారిత్రక నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రణబాలీ'ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలోని యాక్షన్ సీన్లు, విజయ్ దేవరకొండ వారియర్ లుక్ ఈ సినిమాకు ప్లస్‌గా నిలియాయి. సిపాయిల తిరుగుబాటు తర్వాత దక్షిణాదిలో బ్రిటిష్ వాళ్లు కరువు, క్షామం తాండవం చేస్తున్న సమయంలో మన వాళ్ల దగ్గర తిండి గింజలను శిస్తుగా కట్టించుకొని వారిని కట్టు బానిసలుగా తమకు సంబంధించిన రైల్వే లైన్ పనుల్లో పెట్టుకోవడం. ఈ సందర్భంగా అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు.
రణబాలి బాక్సాఫీస్ దండయాత్ర..
ఈ సినిమా తొలి రోజు దాదాపు రూ. 10 కోట్ల షేర్ (రూ. 20 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఈవెనింగ్, నైట్ షోలకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓవరాల్‌గా రెండు రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8 కోట్ల షేర్ (రూ.16 కోట్ల) వసూళ్లను రాబట్టినట్టు చెబుతున్నారు. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ. 18 కోట్ల షేర్ (రూ. 36 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. పోటీలో జైలర్ 2 నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఇస్తుంది. అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.రూ. 43 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇంకా రూ. 24 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది.
దసరా సెలవుల అడ్వాంటేజీ..
ఈ రోజు ఆదివారంతో పాటు దసరా సెలవులు ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి. ఈ సినిమా ఓవర్సీస్లో అర మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన వన్ మిలియన్ వైపు అడుగులు వేస్తుంది. లాంగ్ వీకెండ్ కావడంతో రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.