12 dead several injured after truck accident in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లోని గ్బాలీయర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చినోర్ నుంచి ట్రక్ భారీలోడ్ తో వచ్చి అదుపుతప్పింది. ఆ తర్వాత పక్కనే ఉన్న శీతల మాత ఆలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రక్ కింద పడి 12 మంది భక్తులు దుర్మరణం చెందారు. మరో 30 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.భారీ ట్రక్ లకు ఆ ప్రదేశంలో నిషేదం ఉన్న కూడా రావడంతో అది కాస్త అదుపుతప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
#WATCH | Madhya Pradesh | Several dead and multiple people injured after a truck ran over several people near a temple in Gwalior Visuals from the hospital where the injured have been taken https://t.co/9h5R7cNgJW
— ANI (@ANI) October 17, 2026
వెంటనే పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది. అమ్మవారి ఆలయం సమీపంలో భక్తులు ట్రక్ కింద పడి నలిగిపోయి విగత జీవుల్లామారిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఘటన స్థలంలోనే 12 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
మరో 30 గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. వీరిలో కొంత మంది తీవ్రమైన గాయాలతో పాటు, ఎముకలు కూడా విరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటనపై అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.