• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /PM Surya Ghar: ఉచిత కరెంట్... జీరో బిల్లు..! పీఎం సూర్యఘర్ సంచలనం..!

PM Surya Ghar: ఉచిత కరెంట్... జీరో బిల్లు..! పీఎం సూర్యఘర్ సంచలనం..!

PM Surya Ghar: ఉచిత కరెంట్... జీరో పవర్ బిల్లు..! ఇది కేవలం మాటలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు APలో ఇది అక్షరాలా నిజమవుతోంది. విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడమే కాకుండా... భానుడి ప్రతాపాన్నే ఉచిత విద్యుత్‌గా మారుస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న భారీ సబ్సిడీలతో రూఫ్‌టాప్ సోలార్ రంగంలో ఏపీ సీపీడీసీఎల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఉచిత సోలార్ పథకంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.

Written ByAshok Krindinti
Published: Sep 18, 2026, 04:18 PM IST|Updated: Sep 18, 2026, 04:20 PM IST
joinshare
PM Surya Ghar: ఉచిత కరెంట్... జీరో బిల్లు..! పీఎం సూర్యఘర్ సంచలనం..!
Image Credit: PM Surya Ghar

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PM Surya Ghar: ఆంధ్రప్రదేశ్‌లో సూర్యకాంతి ఇప్పుడు ఇంటింటికీ వెలుగులుంచుతోంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమే టార్గెట్ గా తెచ్చిన 'పీఎం సూర్యఘర్' పథకం రాష్ట్రంలో స్పీడప్ అందుకుంది. ఇప్పటికే 4 లక్షల 93 వేల  సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లతో ఏపీ జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. ఒక్క APCPDCL పరిధిలోనే దాదాపు 55 వేల సోలార్ కనెక్షన్లను గ్రిడ్‌కు అనుసంధానించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నేతృత్వంలో సమీక్షలు నిర్వహిస్తూ, రాబోయే నెలల విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు వేగవంతం చేస్తున్నారు.

పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ప్రభుత్వం అదనపు ఊరటనిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ గృహాలకు నూటికి నూరు శాతం ఉచితంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కో ఇంటికి రూపాయి కూడా ఖర్చు లేకుండా లక్షా 25 వేల వరకు వెచ్చిస్తూ 2 కేవీ లేదా 3 కేవీ సోలార్ ప్యానెళ్లను బిగిస్తున్నారు. ప్రకాశం జిల్లా వై.పాలెం నియోజకవర్గంలో 2,661 కుటుంబాలకు రూ.32.34 కోట్లతో సోలార్ వెలుగులు నింపగా, చిన్నగుడిపాడు వంటి ప్రాంతాల్లో వందలాది ఇళ్లు వెలిగిపోతున్నాయి.

నెలకు 200 యూనిట్ల లోపు వాడే బీసీ కుటుంబాలకు కూడా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. 2 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌పై కేంద్రం ఇచ్చే 60వేల సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 వేలు ఇస్తోంది. అంటే ఏకంగా 80,000ల సబ్సిడీ దక్కుతుంది. మిగిలిన రూ.40,000ల కోసం APCPDCL తరపున బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణం అందిస్తున్నాయి. ఈ రుణాన్నీ వినియోగదారులు నెలకు వచ్చే విద్యుత్ బిల్లుతో పాటు 60 ఈఎంఐలలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.

ఈ సిస్టమ్ అంతా ఆన్-గ్రిడ్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇళ్లపై ఉత్పత్తి అయిన విద్యుత్ నేరుగా పవర్ గ్రిడ్‌కు కనెక్ట్ అవుతుంది. ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపితే... డిస్కమ్‌లే ప్రతి యూనిట్‌కు 2.09 పైసల చొప్పున లబ్ధిదారుడికి చెల్లిస్తాయి. అంటే కరెంట్ బిల్లు కట్టకపోగా.. తిరిగి కరెంట్ ద్వారానే డబ్బు సంపాదించుకునే అవకాశం లభిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కొన్ని చోట్ల క్వాలిటీ లేని ప్యానెళ్లు, వెండర్ల ఆలస్యం వల్ల సమస్యలు రాకుండా అనుభవం ఉన్న కంపెనీలనే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బొగ్గు కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వేళ.. సోలార్ విద్యుత్ భవిష్యత్తుకు ఏకైక మార్గంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న ఈ భారీ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటే కరెంట్ బిల్లుల భారం నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Vijayawada
AP News
Govt Schemes