• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్‌.. ఐదారు గంటలు బిజీబిజీ

Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్‌.. ఐదారు గంటలు బిజీబిజీ

Full Schedule Of TN CM Vijay AP Tour For Tomorrow And Agenda: తమిళనాడులో సంచలన విజయం సాధించిన టీవీకే విజయ్‌ తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. విజయవాడ దసరా ఉత్సవాలతోపాటు ఏపీ, తమిళ రాష్ట్రాల మధ్యనున్న సత్సంబంధాల బలోపేతంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ఈ పర్యటన దోహదం చేయనుంది. విజయ్‌ ఏపీ టూర్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 12, 2026, 11:41 PM IST|Updated: Oct 12, 2026, 11:45 PM IST
joinshare
Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్‌.. ఐదారు గంటలు బిజీబిజీ
Image Credit: Vijay AP Tour

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్‌.. ఐదారు గంటలు బిజీబిజీ

Vijay AP Tour: రేపు ఏపీ టూర్‌కు తమిళ సీఎం విజయ్‌.. ఐదారు గంటలు బిజీబిజీ

2

Governors Appointments: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కేరళం, ఒడిశాకు కొత్త వ్యక్తులు

3

Nandamuri Mokshagna: బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞపై సానుభూతి చూపిస్తున్న తేజస్విని భర్త భరత్.. కారణం ఇదే!

4

ECI Form 6 SIR Controversy: ఓటర్ల జాబితా సవరణ వివాదం.. SIR ‘ఫారం-6’పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

5

Srikanth Daughter Medha: శ్రీకాంత్ కుమార్తె మేధ హీరోయిన్‌గా ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tomorrow Vijay AP Tour: సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు.. నదీ జలాలు పంచుకున్నట్టే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న విజయ్‌ తొలిసారిగా ఏపీ రాష్ట్రానికి రాబోతున్నారు. విజయవాడ దసరా ఉత్సవాలతోపాటు ఏపీ, తమిళ రాష్ట్రాల మధ్య సత్సంబంధాల బలోపేతంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ఈ పర్యటన దోహదం చేయనుంది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకోవడంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబుతో విజయ్‌ సమావేశం కానున్నారు. ఏపీ పర్యటన చేపడుతున్న విజయ్‌ రేపు దాదాపు నాలుగు ఐదు గంటలు పూర్తి బిజీబిజీగా ఉండనున్నారు. విజయ్‌కు సంబంధించిన ఏపీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

రేపు అక్టోబర్ 13వ తేదీన సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ రానున్నారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విజయవాడలో నిర్వహించే ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అంతకుముందు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో విజయ్ భేటీ కానున్నారు.

తమిళ సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు, ఆలయ ప్రాంగణంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్, యాంటీ సబాటేజ్ బృందాలతో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, విశ్రాంతి గదుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. దసరా భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తమిళనాడు సీఎం పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అధికారుల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

విజయ్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదే!
అక్టోబర్‌ 13వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి పయనం
సాయంత్రం 4.00 గంటలకు గన్నవరం (విజయవాడ) విమానాశ్రయానికి చేరిక
4- 4.10 గంటల మధ్య విమానాశ్రయంలో ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల స్వాగతం
సాయంత్రం 4.10 గంటలకు విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయానికి రోడ్డు మార్గంలో పయనం
సాయంత్రం 4.55 గంటలకు కనకదుర్గ ఆలయానికి చేరుకుని 5.45 గంటల వరకు అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు
5.45 గంటలకు కనకదుర్గ ఆలయం నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరడం
సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య సీఎం చంద్రబాబుతో భేటీ. ఈ సమావేశంలో నదుల అనుసంధానంపై, గోదావరి - కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్ట్, కృష్ణా జలాల విడుదలపై చర్చించే అవకాశం
సాయంత్రం 7.00 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి పున్నమి ఘాట్‌కు బయల్దేరి 7.10 గంటలకు దసరా ఉత్సవ్ కార్యక్రమాలకు హాజరు
సాయంత్రం 7.10 నుంచి 8.00 గంటల వరకు దసరా ఉత్సవ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి తమిళ సీఎం విజయ్‌ వీక్షణ
రాత్రి 8 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరి 9 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణం

Add Zee News as a Preferred Source
TAGS:
Vijayawada
Chandrababu Naidu
Telugu News
Trending News