• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హై అలర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హై అలర్ట్..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉండటమే కాకుండా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 06:50 IST|Updated: Nov 25, 2026, 09:48 IST
joinshare
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హై అలర్ట్..
Image Credit: AP Rains (Source/ZEE Telugu News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

2

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

3

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

4

రెగ్యులర్ కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ కథానాయికలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఇమేజ్ మేకోవర్..

5

డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Andhra Pradesh Weather Update: ఆంధ్ర ప్రదేశ్‌‌ను వరస తుపానులు బెంబేలెత్తుస్తున్నాయి. ఇప్పటికే అర్నాబ్, మురసు, అక్వాన్ తుపానులు వచ్చి వెళ్లాయి. ఇందులో అక్వాన్ భారీ నష్టాన్ని మిగుల్చింది. మురసు దక్షిణ కోస్తాను దెబ్బ తీసింది. ఇక అక్వాన్ తుపాను ముప్పు ఏపీలో లేకుండా ఒడిస్సా వైపు వెళ్లి పోవడంతో పెను ముప్పు తప్పింది. అయితే త్వరలో ఆంధ్ర ప్రదేశ్‌ను మరో తుపాను ముంచెత్తే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్..
ఈ రోజు కోనసీమ, కృష్ణా, గుంటూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,  బాపట్ల, పల్నాడు, , శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప,మార్కాపురం, ప్రకాశం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని సూచించింది.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు..

వర్షాలతో పాటు పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.  ఈ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.  ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని, తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
Weather Update
Telugu News