Vizianagaram: ఏపీలో షాకింగ్ ఘటన.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న థార్.. నలుగురు దుర్మరణం..
Road Accident in Vizianagaram: విజయ నగరంలోకి భోగాపురంలో ఆగిఉన్నలారీని వేగంగా వచ్చిన థార్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో థార్ నుజ్జు నుజ్జు అయ్యింది.ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
Four dead car and lorry collision in Vizianagaram: దేశ వ్యాప్తంగా ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలతో జనాలు హడలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన వారు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్ పడాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది. కొంత మంది రోడ్డు మీద నెగ్లీజెన్సీ డ్రైవింగ్ వలన తమ ప్రాణాల్ని మాత్రమే కాకుండా ఇతరుల్ని కూడా ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని విజయ నగరంలోని భోగాపురం జిల్లా సుందరపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న థార్ కారు ఢీకొట్టింది. ఆ తర్వాత థార్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో థార్ లో ఉన్న నలుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని వాహనంలో ఇరుక్కున్న వారిని బైటకు తీశారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళల ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు ఘటనస్థలంకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వాహనంలో గాయపడ్డ మరో వ్యక్తి వెల్లడించాడు. అయితే.. లారీని రోడ్డుపై నిలిపి డ్రైవర్ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రుడిని సుందరపేట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.