High court key orders on Kakinada tuni girl missing case: ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. చిన్నారి తప్పిపోయి దాదాపు 160 రోజులు దాటుతున్న కూడా ఇప్పటికి బాలిక ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదు. మరోవైపు బాలిక జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గణేష్, భవానీ దంపతులు ఇప్పటికే తమ కూతుర్ని తలచుకుంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలిక చివరగా తమ ఇంట్లో పెంపడు శునకం వెనకాల వెళ్లడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ తర్వాత శునకం అనారోగ్యంతో జూన్ 13న చనిపోయింది.
శునకంకు పోస్ట్ మార్టం నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద విషయాలు బైటపడలేదు. మరోవైపు బాలిక జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తాజా ఆదేశాలతో.. అదనపు ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మరోసారి బాలిక కోసం సీహెచ్ అగ్రహరం ప్రాంతంలో ఏదైన క్లూ దొరుకుందేమోనని విచారణ చేపట్టారు.
ఆయిల్ ఫామ్, కొండ ప్రాంతాల్లో మరోసారి అడుగడుగు జల్లెడ పట్టడానికి అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు గతంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో విస్తృతంగా గాలించినా కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇప్పటికే పోలీసులు చిన్నారి గురించి ఏదైన ఆచూకి తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు హైకోర్టు ఆదేశాలతో మరోసారి తుని ఘటన వార్తలలో నిలిచింది.