• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /ఆ జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పదవులకు బిగ్‌ ఫైట్.. కూటమి పార్టీల మైండ్ గేమ్..!

ఆ జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పదవులకు బిగ్‌ ఫైట్.. కూటమి పార్టీల మైండ్ గేమ్..!

East Godavari ZP Chairman Posts: తెలుగు రాష్ట్రాల్లోనే ఉమ్మడి గోదావరి జిల్లా ప్రజా పరిషత్తుకు ఓ రికార్డు ఉంది..! ఇక్కడ జడ్పీ చైర్మన్ అయ్యాక.. ఎందరో రాజకీయ ఉద్దండులు మరిన్ని కీలక పదవులు అధిరోహించారు..! ఉమ్మడి తూర్పు జడ్పీ చైర్మన్ అంటే క్యాబినెట్ ర్యాంక్ కంటే ఎక్కువగా భావిస్తారు..! అలాంటి వైభవం ఉన్న జడ్పీ చైర్మన్ పీఠం ఉమ్మడి జిల్లా నుంచి ముక్కలుగా విడిపోయింది..! కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లా పరిషత్ లుగా చీలిపోయింది. ఇప్పుడు ఈ సీట్ల కోసం ఎవరికి వారుగా రాజకీయం మొదలు పెట్టడంతో.. జడ్పీ పీఠాలు ఎవరికి దక్కుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారిందా..! టీడీపీ- జనసేన- బీజేపీలు ఎవరికి వారుగా మైండ్ గేమ్ మొదలు పెట్టడంతో.. గోదావరి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయా..!

Written ByGurram Shekar
Published: Oct 02, 2026, 05:00 PM IST|Updated: Oct 02, 2026, 05:01 PM IST
joinshare
ఆ జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పదవులకు బిగ్‌ ఫైట్.. కూటమి పార్టీల మైండ్ గేమ్..!
Image Credit: East Godavari ZP Chairman Posts

About the Author

Gurram Shekar

Gurram Shekar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సుప్రీంకోర్టులో రూ.35 వేల జీతంతో 250 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతోనే జాబ్.. పూర్తి వివరాలివే!

సుప్రీంకోర్టులో రూ.35 వేల జీతంతో 250 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతోనే జాబ్.. పూర్తి వివరాలివే!

2

ఆ జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పదవులకు బిగ్‌ ఫైట్.. కూటమి పార్టీల మైండ్ గేమ్..!

3

ప్రసవ కోసం వచ్చిన మహిళకు నో ఎంట్రీ.. చివరకు ఆసుపత్రి ముందే బిడ్డకు జన్మ!

4

‘సిగ్మా’ మూవీ రివ్యూ.. విజయ్ కుమారుడి సినిమా ఎలా ఉందంటే..!!

5

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ పబ్లిక్ టాక్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

East Godavari ZP Chairman Posts: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కూటమి పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో జడ్పీ పీఠాలపై టీడీపీ, జనసేన పార్టీలు కన్నేశాయి. గతంలో 2021లో ఉమ్మడి జిల్లాల్లో జడ్పీ ఎన్నికలు జరిగాయి. అనంతరం జిల్లాలు విడిపోయాయి. పాలకవర్గం పదవీకాలం ముగిసే వరకు ఉమ్మడి జిల్లాలుగానే కొనసాగించాలన్న నిబంధనతో 2026 సెప్టెంబర్ 24 వరకు ఉమ్మడి జిల్లాలు గానే కొనసాగించారు. 61 జిల్లా పరిషత్తులతో ఉమ్మడి తూర్పుగోదావరి నిన్న మొన్నటి వరకు కొనసాగింది. రాజకీయ ఉద్దండులైన సత్యనారాయణ రావు, జిఎంసి బాలయోగి, బొడ్డు భాస్కర రామారావు, వంగా గీత, దున్నా జనార్ధనరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వంటి వారు ఉమ్మడి జిల్లా చైర్మన్ లు గా ఓ వెలుగు వెలిగారు. చివరి ఉమ్మడి తూర్పు చైర్మన్ గా విప్పర్తి వేణుగోపాలరావు పేరు నిలిచిపోయారు. 

ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జడ్పీ చైర్మన్ గా పనిచేస్తే అనంతరం మంచి రాజకీయ అవకాశాలు దక్కుతాయనే సెంటిమెంటు ఉంది. ఒక్క దున్నా జనార్ధన రావు మినహా మిగిలిన వారంతా రాజకీయంగా ఎన్నో పదవులు పొందారు. దివంగత బాలయోగి జడ్పీ చైర్మన్ అనంతరం ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, లోక్ సభ స్పీకర్ వరకు ఎదిగారు. ఆ తర్వాత జడ్పీ చైర్మన్ గా పని చేసిన తర్వాత వంగా గీత ఎమ్మెల్యే, రాజ్యసభ, పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు. ఇక బొడ్డు భాస్కర రామారావు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యే ,మంత్రి అయ్యారు. చివరి జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు భవిష్యత్తులో ఏమవుతారు అన్న చర్చ జరుగుతోంది. 

ఈసారి నాలుగు జిల్లా ప్రజా పరిషత్తులు కొత్తగా ఏర్పాటయ్యాయి. జడ్పీటీసీల సంఖ్య పెరగనప్పటికీ చైర్మన్లు పెరుగుతున్నారు. ప్రతిపక్ష నేతలు పెరుగుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణ అవుతోంది. దీంతో మొట్టమొదటిగా ఏర్పడుతున్న కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల చైర్మన్ పదవిని అధిరోహించేందుకు టిడిపి ,జనసేన ,బిజెపి, వైసిపి పార్టీలు ఇప్పటినుంచి పైరవీలు ప్రారంభించాయి. ఎవరికి వారే ఈ సీట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జడ్పిటిసిగా ఎంపిక అయితే వారిలో ఒకరిని చైర్మన్ గా పరోక్ష పద్ధతిలో ఎంపిక చేసేవారు. దీంతో జడ్పీటీసీలను మేనేజ్ చేయవలసి వచ్చేది. వారి దయా దాక్షిన్యాల మీద ఈ పదవి ఉండేది. అప్పట్లో ఎప్పుడు పడితే అప్పుడు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే విధానం ఉండేది. ఇక వైయస్ సీఎం అయ్యాక నాలుగేళ్ల వరకు అసమ్మతి పెట్టడానికి వీల్లేదని చట్టం తెచ్చారు. ఈసారి కూటమి ప్రభుత్వం పరోక్ష పద్ధతిలో జడ్పీ చైర్మన్ ను ఎన్నుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దాంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ ను ప్రజలే నేరుగా ఎన్నుకునే అవకాశం ఏర్పడుతోంది. 

మరోవైపు నాలుగు జడ్పీ పీఠాలపై పోలవరంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా మిగిలిన మూడు జిల్లాల జడ్పీ చైర్మన్ ల కోసం పోటీ గట్టిగానే ఉందని అంటున్నారు. మూడుకు మూడు తమకే ఇవ్వాలని టిడిపి, జనసేన పట్టుబడుతున్నాయి. చైర్మన్ పదవి కాకపోయినా పరోక్ష పద్ధతిలో జరిగే వైస్ చైర్మన్ ఎన్నికతో బిజెపిని సంతృప్తి పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాకినాడ నుంచి ఎంపీ జనసేన తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందున కాకినాడ జనసేనకు, అమలాపురం ఎంపీ టిడిపికి చెందిన వారు కావడంతో ఆ జడ్పీ టీడీపీకి, తూర్పుగోదావరి ఎంపీగా బిజెపికి చెందిన పురందేశ్వరి ఉండడంతో ఆ సీటు బిజెపికి ఇవ్వాలని కొందరు ప్రతిపాదనలు తెచ్చారు.

అయితే బిజెపికి అంత సీన్ లేనందున రెండు టిడిపి, ఒకటి  జనసేన అని టిడిపి వర్గాలు, కాదు కాదు రెండు జనసేన, ఒకటి టిడిపి అని జనసేన వర్గాలు వాదులాడుకుంటున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీట్లకు సంబంధించి తగ్గేదే లేదని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. అలాగే స్థానిక సంస్థలు ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లు ఇస్తామని టిడిపి జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. పైగా ఈ విషయాన్ని సాక్షాత్తు పవన్ కళ్యాణ్  మాట్లాడినట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. దీంతో మూడు జడ్పీ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయి అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. 

మొత్తంమీద చూస్తే కొత్త జడ్పీ లకు పవర్ తక్కువ అనే మరో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థికంగా దివాలా తీసింది. ప్రభుత్వం నుంచి ఏకంగా 66 కోట్ల రూపాయలు ఉమ్మడి జిల్లాకు రావాల్సి ఉంది. ప్రభుత్వం వీటిని విడుదల చేస్తే జడ్పీ సీట్ల ఆధారంగా వీటిని పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ గతంలో జడ్పీ చైర్మన్ అంటే క్యాబినెట్ హోదా ఇచ్చేవారు. ఇప్పుడు ముక్కలుగా విడిపోయినందున ఆ హోదా ఇస్తారా లేదా అని కూడా రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. మరోపక్క ఉమ్మడి తూర్పులో పోలవరం మినహా మిగిలిన మూడు జడ్పీ లపై టిడిపి, జనసేన కన్నేశాయి. ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరికి వారే చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో జడ్పీ పీఠాలు ఎవరికి దక్కుతాయి అనేది మాత్రం అసక్తికరంగా మారింది.. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Politics
Telugu News
Visakhaptnam
AP News