SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రపంచాన్ని వణికిస్తున్న AI.. 2027లో భారీగా పెరగబోతున్న నిరుద్యోగిత..

AI Fear: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నానాటికీ కొత్త వేరియేషన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆధునిక టెక్నాలజీ ఉపాధి అవకాశాలతో యువకుల జీవితాలను మార్చేస్తుందనుకున్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది. జీవితాలను ఆగం చేస్తోంది. సాఫ్ట్ వేర్ రంగాన్ని ఎంచుకున్న యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పుతో టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తును ఊహించుకుంటే దారుణ పరిస్థితులు ముంచుకొస్తున్నాయని టెక్ సైంటిస్టులు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏంచేస్తోంది? టెక్ దిగ్గజాల్లో ఖంగారెందుకు?

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 05:59 IST | Updated: Nov 23, 2026, 06:00 IST
Image Credit: AI Technology (Source/ZEE News Telugu)
Join

Artificial Intelligence: టెక్నాలజీలో మార్పుతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉక్కు పిండంగా నిపుణులను బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకీ వస్తున్న టెక్నాలజీలో మార్పులు… ఆర్టిఫీషియల్ కొత్త వేరియంట్లు… సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పాలిట దారుణంగా మారాయి. టెక్నాలజీ పరంగా రాబోయే కొద్దేళ్లలో  ఏఐ వల్ల ముప్పు ముంచుకు రాబోతోందని శాస్త్రనిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. సాఫ్ట్ వేర్ రంగంలో దాదాపు 50 శాతం ఎంట్రీ-లెవల్ వైట్-కాలర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆంథ్రోపిక్ పరిశోధకులు టావోలిన్ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. టావోలిన్ అభిప్రాయంతో ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీ ఏకీభవించడం సంచలనంగా మారింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో యేడాది కాలవ్యవధిలోనే సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని టెక్ దిగ్గజాలు మదనపడుతున్నాయి. నిరుద్యోగ రేటు పెరుగుదల. ఈ మార్పుల వల్ల నిరుద్యోగ రేటు 10 శాతం నుండి 20 శాతం వరకు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్, న్యాయ,  కన్సల్టింగ్ రంగాల్లోని ప్రారంభ స్థాయి ఉద్యోగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

టెక్ సంస్థల్లో వేగవంతంగా… ఖచ్చితత్వంతో పనిచేసే విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్త రూపాల్లో దూసుకొస్తోంది. ఏఐ యుగం… నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోంది. సూపర్ హ్యూమన్ ఏఐ రాక వల్ల 2027 నాటికి మానవ మేధస్సును మించిన 'సూపర్ హ్యూమన్ ఏఐ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు ప్రస్తావించారు. కొత్త టెక్నాలజీతో ఆర్థిక అసమానతలు, సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉందని టెక్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆర్టిఫీషియల్ కొత్త వేరియంట్ల పనితీరులో వేగవంతం, ఖచ్చితత్వం..

టెక్నాలజీ మార్పులతో శాశ్వత నిరుద్యోగం సమాజానికి ప్రమాదకరంగా మారబోతోంది. ఆంథ్రోపిక్ సేఫ్‌గార్డ్స్ పరిశోధకుడు టావో లిన్  కీలక వ్యాఖ్యలు చేశారు. People Matters నివేదిక ప్రకారం, 2027 చివరి నాటికి దాదాపు అన్ని రంగాల్లో మనుషుల కంటే మెరుగ్గా పనిచేసే ఏఐ వస్తుందన్నారు. ఏఐ, రోబోటిక్స్ వేగంగా విస్తరిస్తే, భవిష్యత్తులో దాదాపు మనుషులందరూ శాశ్వతంగా ఉద్యోగాలకు అనర్హులుగా  మారే అవకాశం టావోలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి వస్తే ప్రజలు జీవనోపాధి కోసం పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫ్రీబీస్ పైనే ఆధారపడాల్సి వస్తుందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

మానవ మేధస్సును మించిన 'సూపర్ హ్యూమన్ ఏఐ అందుబాటులోకి వచ్చినంత మాత్రాన ఎవ్వరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని టావోలిన్ ప్రస్తావించారు. భౌతిక పనులు చేసే రోబోల తయారీకి సమయం పడుతుంది కాబట్టి, ముందుగా సాఫ్ట్‌వేర్ , మేధోపరమైన రంగాల్లో ఉద్యోగాలు తగ్గి, ఆ తర్వాత మిగిలిన రంగాలకు ఈ ప్రభావం విస్తరిస్తుందని ఆయన వివరించారు. అందరి ఉద్యోగాలకు ఒకేసారి ముప్పురాదని  టావోలిన్ స్పష్టం చేశారు.

ఉద్యోగాలను కాపాడుకోవాలంటే సాధారణ ప్రజలు, ఉద్యోగులు ఏఐ పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలని డారియో అమోడీ సూచించారు. ఏఐని ఒక టూల్‌గా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యమని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీ సూచించారు.  ఏఐ కంపెనీలపై పన్నులు విధించడం ద్వారా ఆ సంపదను సాధారణ ప్రజలకు పంచేలా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏఐ అభివృద్ధి వేగాన్ని కొంత నియంత్రించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇంజినీరింగ్ పట్టభద్రులు.. సాఫ్ట్ వేర్ రంగంపైనే దృష్టిపెట్టకుండా… ఉత్పాదక సంస్థల్లో పనిచేసి ఉపాధి అవకాశాలను పెంపొందించుకునే విధంగా యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు. చదువుతోపాటు లైఫ్ స్కిల్స్ పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు. నైపుణ్యాలను పెంచుకోవడం.

టావోలిన్ వ్యాఖ్యలను సమర్థించిన సీఈవో డారియో అమోడీ ..

ప్రపంచ వ్యాప్తంగా 2027 నాటికి నిరుద్యోగం భారీగా పెరుగుతుందనే ప్రచారంతో నిరుద్యోగ యువత ఆందోళనకు గురిగాకుండా… కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు పూనుకోవాల్సిన అవసరాన్ని టెక్నాలజీలో మార్పులు హెచ్చరిస్తున్నాయి. ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాల కోత, తాత్కాలిక ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.  

Goldman Sachs Research నివేదిక ప్రకారం, AI  వినియోగం వల్ల కొన్ని ఉద్యోగాలు పోయి నిరుద్యోగ రేటులో స్వల్పంగా, తాత్కాలికంగా పెరుగుదల ఉండవచ్చుని సమాచారం. 2027లో లేబర్ మార్కెట్‌పై ఏఐ ప్రభావం తక్కువగానే ఉంటుందని, 2028-2029 నాటికి వ్యాపార పునర్వ్యవస్థీకరణ వల్ల పెద్ద మార్పులు కనిపిస్తాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రొటీన్ రీసెర్చ్, కస్టమర్ సర్వీస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో ఏఐ వాడకం పెరగడం వల్ల కొత్త నియామకాల వేగం కొంత నెమ్మదించే అవకాశం ఉందని Stanford SIEPR అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలపై ఒత్తిడి పెరగవచ్చని తెలుస్తోంది.

టెక్నాలజీ రంగంలో వచ్చే మార్పులు యునైటెడ్ కింగ్ డమ్ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా యూకే  వంటి కొన్ని పాశ్చాత్య దేశాల్లో 2027లో ఆర్థిక వృద్ధి నెమ్మదించి నిరుద్యోగ రేటు 5.7% వరకు పెరిగే అవకాశం ఉందని Institute for Fiscal Studies అంచనా వేసింది. గల్ఫ్ ప్రాంతంలో కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని Cooper Fitch 'యూఏఈ శాలరీ గైడ్ 2027' నివేదిక వెల్లడించింది.

సాఫ్ట్ వేర్ రంగంలో నిరుద్యోగులు పెరిగే అవకాశం.. 

భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితికి ఢోకాలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగ మార్పులపై యువతలో ఆసక్తికి అనుగుణంగా ఉపాధి అవకాశాలున్నాయి. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, 2027లో 68.4% మంది భారతీయ నిపుణులు మెరుగైన జీతం, కెరీర్ వృద్ధి కోసం కొత్త ఉద్యోగాలకు మారాలని చూస్తున్నారని foundit 'కెరీర్ రీసెట్ సర్వే 2027' తెలిపింది. ఐతే టెక్నాజీతో పట్టభద్రులైన వారిలో  నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. భారతదేశంలో 2027లో సగటున 9.1% వరకు జీతాల పెంపు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, AI వంటి ఆధునిక నైపుణ్యాలు నేర్చుకున్న వారికే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
 
కొత్తగా ఇంజినీరింగ్ పట్టభద్రులు టెక్నాలజీ రంగంలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే… భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. యువత భవిష్యత్తుపై దిగులు పెట్టుకోకుండా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుని సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, సాటివారికి ఉపాధి అవకాశాలను కల్పించే స్థాయికి ఎదగాలని పారిశ్రామిక వేత్తలు, టెక్ దిగ్గజాలు సూచిస్తున్నారు.

(రచయత..మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో..)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES