SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆల్ టైమ్ నుంచి 26శాతం పడిపోయిన బంగారం ధర.. కొనేందుకు ఇదే సరైన సమయమా..??

Gold Rate: బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు.. ఇప్పుడు భారీగా పతనం అవుతున్నాయి. మరి బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా? భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Written By Bhoomi
Published: Oct 25, 2026, 08:57 AM IST | Updated: Oct 25, 2026, 09:00 AM IST
Image Credit: Gold Rate
Join

Gold Rate: బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.  ప్రస్తుతం ధరలు  భారీగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేట్ 4,007డాలర్లకు చేరుకుంది. దేశీయ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా.. లేదా కొనేందుకు ఇదే సరైన సమయమా? మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు.. తెలుసుకుందాం.

ఈ సంవత్సరం జనవరి 28న.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 5,600 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, అక్టోబర్ 23 నాటికి, గరిష్ట ధర నుండి 26శాతం కంటే ఎక్కువ తగ్గుదలతో ధర 4,007 డాలర్లకు పడిపోయింది.  దేశీయ మార్కెట్‌లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జనవరి 29న, MCXలో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 1,76,306 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ 23, గురువారం నాటికి, అది రూ. 1,42,778 డాలర్లకు పడిపోయింది. ఇది బంగారం.. వెండి పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది. కాగా ఈ ఏడాది స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు గురవుతూనే ఉంది.

బంగారం ధరలు తగ్గడానికి కారణాలు ఏమిటి? 
అనేక అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధరలు పడిపోతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, బలపడుతున్న అమెరికన్ డాలర్.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. చమురు ధరలు పెరిగితే, రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దీనివల్ల, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంచవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే.. ఎలాంటి ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి  చూపించరు.  బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నృపేంద్ర యాదవ్ ప్రకారం, యూఎస్ డాలర్ బలపడటం బాండ్ ఈల్డ్స్ పెరగడం బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల ధరలు పెరగడంతో, కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను స్వీకరిస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు అధికంగా ఉండవచ్చనే అంచనాలు బంగారంపై ఒత్తిడి తెస్తున్నాయని ఓగ్మాంట్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రూప్షా చైనాణి కూడా అన్నారు.

బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా? 
ప్రస్తుత ధరల తగ్గుదల అంటే బంగారంలో దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ పూర్తిగా ముగిసిపోయిందని అర్థం కాదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. నృపేంద్ర యాదవ్ తెలిపిన వివరాల  ప్రకారం.. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,000కు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ధరలు 10 నుండి 15 శాతం వరకు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $4,200 మార్కును దాటిన తర్వాత స్థిరపడితే, అది మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇవి కేవలం మార్కెట్ అంచనాలు మాత్రమే. ధరలు ఖచ్చితంగా ఈ స్థాయిలకు చేరుకుంటాయనే గ్యారెంటీ లేదు.

మీరు ఇప్పుడు బంగారం కొనాలా? పెట్టుబడిదారులు ఏమి చేయాలి?

బంగారం ధరలు పతనం అవుతున్న నేపథ్యంలో..  తక్కువ ధరకు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అయితే, కేవలం ధరలు పడిపోయాయనే కారణంతో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ధరలు హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు తొందరపడి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే బదులు, మీ ఆర్థిక పరిస్థితి, రిస్క్ తట్టుకునే సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యాల ఆధారంగా దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని నృపేంద్ర యాదవ్ సూచిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేయగలవు. అందువల్ల, అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలను పర్యవేక్షించడం ముఖ్యం.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES