• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /శరత్ పౌర్ణమి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు అదృష్టం కలిసొస్తుందా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

శరత్ పౌర్ణమి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు అదృష్టం కలిసొస్తుందా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

Sharad Purnima 2026: ఈ 25వ తేదీ వచ్చిన పౌర్ణిమ ఎంతో ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఈరోజే ఎన్నో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడ్డాయి.. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి దిమ్మ తిరిగే ధన లాభాలు కలగబోతున్నాయి. ఆర్థికపరంగా ఎలాంటి నోటు ఉండదని కోరుకుంటున్న కోరికలు సింపుల్గా నెరవేరుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 09:47 AM IST|Updated: Oct 25, 2026, 09:49 AM IST
joinshare
శరత్ పౌర్ణమి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు అదృష్టం కలిసొస్తుందా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

2

శని-చంద్రుల కలయికతో విష యోగం? అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారికి కీలక సూచనలు!

3

శరత్ పౌర్ణమి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు అదృష్టం కలిసొస్తుందా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

4

డిసెంబర్ 5 నుంచి కేతువు సంచారం.. ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని జాక్‌పాట్!

5

కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్.. ఉచితంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇలా పొందండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sharad Purnima 2026 Zodiac News: హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో శుభప్రదమైన పండగగా భావిస్తూ ఉంటారు. అయితే, అక్టోబర్ 25వ తేదీ వచ్చిన పౌర్ణమికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు లక్ష్మీ పూజను చేయడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా చంద్రుడి దర్శనం కారణంగా విశేషమైన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే ఈ పౌర్ణమిని శరత్ పౌర్ణిమగా కూడా పిలుస్తూ ఉంటారట. ఇదిలా ఉంటే 30 సంవత్సరాల తర్వాత ఈ పౌర్ణమి రోజున ఎన్నో శక్తివంతమైన రాజయోగాలు కూడా ఏర్పడ్డాయి. వీటి ప్రభావం దాదాపు రెండు రోజులపాటు కొనసాగుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు.

శుభ యోగాలు..
ఈ శరత్ పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడమే కాకుండా దానధర్మాలు చేయడం చాలా శుభ్రమని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు..అయితే, జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ సమయంలో ఎన్నో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడ్డాయి. అందులో చాలా ప్రత్యేకమైన యోగంగా భావించే సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడింది.. అంతేకాకుండా ఎన్నో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

వృషభ రాశి 
వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు నుంచి దాదాపు మరో రెండు రోజులపాటు శుక్రుడి అద్భుతమైన అనుగ్రహంతో జీవితంలో ఆనందంతో పాటు సంపద అందం విలాసవతాన్ని పొందగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా వీరికి జీవితంలో ఆర్థికపరంగా వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే వీరు ఈ సమయంలో తప్పకుండా కొత్త ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా.. ఉద్యోగంలో చాలావరకు స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులతో జీవితంలో ఆనందంతో పాటు కుటుంబంలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి అద్భుతంగా ముందుకు సాగుతారు.

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి కూడా ఈ పౌర్ణమి నుంచి బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఇష్టమైన పనులు చేసి ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా పొందుతారు. జీవితంలో ఆనందంతో పాటు శాంతి ఐశ్వర్యాలు కూడా లభించబోతున్నాయి.. ముఖ్యంగా చంద్రుడి అనుగ్రహంతో మనస్సు కూడా చాలా ప్రశాంతంగా మారి అనుకున్న పనులు సింపుల్గా చేయగలుగుతారు. కుటుంబంలో సంతోషం మరింత మెరుగుపడి కొన్ని రకాల లాభాలు కూడా పొందుతారు ఆర్థికపరంగా ఈ సమయంలో మంచి మెరుగుదల కూడా కనిపిస్తుంది.

సింహరాశి 
సింహ రాశి వారికి కూడా ఈ పౌర్ణమి రోజు నుంచి నాయకత్వ లక్షణాలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరిగి అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉద్యోగంలో గౌరవం పెరగడమే కాకుండా పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారాల విషయంలో కొత్త కొత్త ప్లానింగ్ చేసి పొదుపు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి కూడా చెందగలుగుతారు. అలాగే అనుకోని ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.

మీన రాశి 
మీన రాశి వారికి కూడా ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది.. అంతేకాకుండా జ్ఞానం కూడా చాలా వరకు పెరిగి ఎలాంటి పనులు చేయాలో సులభంగా ఆలోచించ గలుగుతారు.. అలాగే వీరికి అద్భుతమైన ఆర్థిక పురోగతి లభిస్తుంది. దీంతో పాటు సమాజంలో గౌరవం లభించి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కొత్త కొత్త అవకాశాలు లభించడమే.. కాకుండా ఉన్న వాటిల్లో ఊహించని విజయాలు కలుగుతాయి దీంతో పాటు కుటుంబంలో శాంతి, సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి.
 

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu News
Telugu Rasi Phalalu