SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్క నెలలోనే పసిడి రూ. 23వేలు పతనం.. నేటి ధరలివే..!!

Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ శనివారం హైదరాబాద్ లో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 25,560గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,090వద్ద ట్రేడ్ అవుతోంది.

Written By Bhoomi
Published: Nov 21, 2026, 09:14 IST | Updated: Nov 21, 2026, 09:16 IST
Image Credit: Gold Rate Today
Join

Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ శనివారం హైదరాబాద్ లో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 25,560గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,090వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా కిలోకు రూ. 1.75 లక్షల దిగువకు చేరింది. ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడంతో దేశీయ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది.

బంగారం ధరలు ఎంత వేగంగా పెరిగాయో.. ఇప్పుడు అంతే వేగంగా కిందికి దిగివస్తున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్స్ గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 19న 10గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,46,406గా ఉంటే నవంబర్ 20 నాటికి అదే ధర రూ. 1,23,584కు తగ్గింది. అంటే దాదాపు నెల రోజుల్లోనే రూ. 22,822మేర పతనం అయ్యింది. అంతకుముందు జనవరి చివరి వారంలో గోల్డ్ ధరలు భారీ గరిష్టాలకు తాకాయి. అప్పటి గరిష్ట స్థాయితో పోల్చితే ప్రస్తుత ధరలు భారీగా తగ్గాయి.

బంగారంతో పాటు, వెండి ధరలు కూడా కొనుగోలుదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నవంబర్ 20న దేశీయ మార్కెట్లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఐబీజేఏ డేటా ప్రకారం, ఆ ఉదయం ఒక కిలో వెండి ధర రూ. 1,50,650గా నమోదైంది. సాయంత్రానికి అది రూ. 1,52,528కి చేరుకుంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్.. ఇతర ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జనవరి చివరిలో ఒక కిలో వెండి ధర రూ. 4.20 లక్షలకు చేరగా, ప్రస్తుత స్థాయి గణనీయమైన తగ్గుదలను సూచిస్తుంది. వెండి కొనాలనుకునే వారు స్థానిక మార్కెట్ ధరలను పరిశీలించాలి.

నవంబర్ 20న.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. కామెక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు దాదాపు 4.5 శాతం తగ్గి, ఔన్సుకు $3,512 డాలర్లకు పడిపోయాయి. వెండి ధరలు కూడా 7 శాతానికి పైగా తగ్గి, ఔన్సుకు $41 డాలర్లకు చేరాయి. అమెరికా డాలర్ బలపడటం, ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరగడం, ఇంకా వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలే ఈ తగ్గుదలకు కారణాలని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాలలో తమ పెట్టుబడులను తగ్గించుకుని, ఇతర సాధనాల వైపు మళ్లడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

ధరలు మరింత తగ్గుతాయా? 
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ, అమెరికా వడ్డీ రేట్లపై సంకేతాలు, పెట్టుబడిదారుల కొనుగోలు-అమ్మకాలు రాబోయే రోజుల్లో ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల, ధరలు మరింత తగ్గుతాయా లేదా వెంటనే పెరుగుతాయా అని కచ్చితంగా చెప్పలేము. ఆభరణాల కొనుగోలుదారులు ఒక్క రోజు మార్పును చూసి తొందరపడి కొనకుండా, తమ స్థానిక ఆభరణాల దుకాణాలలో తాజా ధరలను తనిఖీ చేసుకోవాలి. పెట్టుబడి పెట్టాలనుకునే వారు  తమ ఆర్థిక పరిస్థితి, అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

గీతారెడ్డి కోసం 1,750 కి.మీ. బైక్ ప్రయాణం ..లవ్ స్టోరీ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..!!

తమిళనాడు నుంచి ఏపీకి పరిశ్రమల వలసలో నిజమెంత?.. పెట్టుబడుల కోసం రెండు రాష్ట్రాల పోటీ!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES