• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /గీతారెడ్డి కోసం 1,750 కి.మీ. బైక్ ప్రయాణం ..లవ్ స్టోరీ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..!!

గీతారెడ్డి కోసం 1,750 కి.మీ. బైక్ ప్రయాణం ..లవ్ స్టోరీ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..!!

CM Revanth Reddy Love Story: ప్రేమ.. ఈ రెండు అక్షరాల కోసం ఎంత త్యాగమైనా చేస్తారు.. ఎంత దూరమైనా వెళ్తామంటారు. ప్రేమలో ఉన్న గొప్పతనం అది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ మాటలను నిజం చేసి చూపించారు.

Written ByBhoomi
Published: Nov 20, 2026, 20:38 IST|Updated: Nov 20, 2026, 20:40 IST
joinshare
గీతారెడ్డి కోసం 1,750 కి.మీ. బైక్ ప్రయాణం ..లవ్ స్టోరీ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..!!
Image Credit: CM Revanth Reddy Love Story

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CM Revanth Reddy Love Story: ప్రేమ.. ఈ రెండు అక్షరాల కోసం ఎంత త్యాగమైనా చేస్తారు.. ఎంత దూరమైనా వెళ్తామంటారు. ప్రేమలో ఉన్న గొప్పతనం అది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ మాటలను నిజం చేసి చూపించారు. మనస్సుకు నచ్చిన అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలన్న గట్టి సంకల్పంతో.. ఏకంగా 1750కిలోమీటర్లకు పైగా బైక్ పై ప్రయాణించి హస్తినకు చేరుకున్నారు. 1990 ల నాటి ఈ సినీఫక్కీ లవ్ స్టోరీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో గుర్తు చేసుకోవడంతో.. వీరి ప్రేమకథ మరోసారి నెట్టింట్లో వైరల్ గా మారింది.

అసలు వీరి ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందంటే.. అప్పట్లో రేవంత్‌రెడ్డి విద్యార్థి నాయకుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్న రోజులవి. నాగార్జునసాగర్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో.. డ్యామ్‌ వద్ద బోటు ప్రయాణం చేస్తుండగా గీతారెడ్డితో తొలి పరిచయం ఏర్పడింది. ఆ సాగర తీరంలో మొదలైన ఆ చిన్న పరిచయం.. కొద్దిరోజుల్లోనే గాఢమైన ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట, జీవితాంతం కలిసి నడవాలని, పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తన ప్రేమను గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి చేసిన 1,750 కిలోమీటర్ల సాహసోపేత బైక్ ప్రయాణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అయతే వీరి ప్రేమకథ కాస్త పెళ్లి వరకు వెళ్లడంతో.. గీతారెడ్డి కుటుంబం నుంచి మొదట్లో అభ్యంతరాలు ఎదురయ్యాయని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రెండు కుటుంబాల రాజకీయ నేపథ్యం, విభేదాల కారణంగా వారు ఈ పెళ్లికి అంగీకరించలేదన్నారు. దీంతో గీతారెడ్డిని ఆమె పెద్దనాన్న, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వద్దకు ఢిల్లీకి.. ఆమె కుటుంబ సభ్యులు పంపించారట. దీంతో రేవంత్ తన ప్రేమను నిలబెట్టుకునేందుకు ఓ సాహోసేపేత నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఉన్న గీతారెడ్డిని కలవడంతో పాటు తమ వివాహం విషయంలో జైపాల్ రెడ్డితో మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా బైక్ పై ఢిల్లీకి వెళ్లినట్లు చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు సుమారు 1,750 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి, అక్కడ గీతారెడ్డిని కలుసుకున్నారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిని కలిసి తన మనసులోని అభిప్రాయాలను స్పష్టంగా వివరించారు. గీతారెడ్డిని వివాహం చేసుకుంటానని చెప్పి, పెద్దలను ఒప్పించడంలో విజయం సాధించారు. ఆ తర్వాత ఇరువైపుల కుటుంబ సభ్యులు వీరి వివాహానికి పచ్చజెండా ఊపడంతో రేవంత్ రెడ్డి, గీతారెడ్డిల పెళ్లికి మార్గం సుగమమైంది.

ఇటీవల జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి తన ప్రేమకథ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రేమలో ఉన్న సమయంలో ఎదురుచూడటం ఎంత కష్టమైన విషయమో అనుభవిస్తేనే అర్థమవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1990ల నాటి ఆ మధుర జ్ఞాపకాలను ఇప్పుడు ఇలా బహిరంగ వేదికపై ఎంతవరకు పంచుకోగలనంటూ తనదైన శైలిలో చమత్కరించారు.

ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో 1992 మే 7వ తేదీన రేవంత్ రెడ్డి, గీతారెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు నిమిషా రెడ్డి అనే కుమార్తె జన్మించారు. కుమార్తె నిమిషా రెడ్డి వివాహం కూడా జరగడంతో, రేవంత్ రెడ్డి ఇప్పుడు తాతగా కూడా ప్రమోషన్ పొందారు.

ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ నాగార్జునసాగర్ సమీపంలో నిర్వహించిన వరుణ యాగంలో రేవంత్ రెడ్డి తన సతీమణి గీతారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటన సందర్భంగా నాగార్జునసాగర్ వద్ద దశాబ్దాల క్రితం నాటి పాత ఫొటోను, ప్రస్తుత ఫొటోను పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన తొలి ప్రేమ చిగురించింది ఇక్కడేననే భావనను ఆయన ఆ పోస్టు ద్వారా వ్యక్తపరిచారు. దీంతో మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఈ జంట ప్రేమ ప్రయాణం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు నుంచి ఏపీకి పరిశ్రమల వలసలో నిజమెంత?.. పెట్టుబడుల కోసం రెండు రాష్ట్రాల పోటీ!

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Telugu News