SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

Gold Rate : దీపావళి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నవంబర్ 8వ తేదీన బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పుల వల్ల గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

Written By Bhoomi
Published: Nov 08, 2026, 09:58 AM IST | Updated: Nov 08, 2026, 10:00 AM IST
Image Credit: Gold Rate
Join

Gold Rate : గత కొన్నిరోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా రెక్కలు విరిగినట్లయ్యింది. వినియోగదారులకు భారీగా ఉపశమనం కల్పిస్తూ ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత నెలలో అంతర్జాతీయంగా బంగారం ధరలు 6.3శాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. నవంబర్ ప్రారంభంలో రూ. 1.46 లక్షలకు పైగా కొనుగోలు అయిన తులం బంగారం ధర గత రెండు రోజులుగా గణనీయంగా తగ్గుతూ వస్తోంది.

ఇటీవల ముగిసిన ధంతేరస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు జోరుగా సాగాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 15 నుంచి 20 శాతం మేర పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క ధంతేరస్ రోజే దేశంలో సుమారు రూ. 60,000 కోట్ల విలువైన బంగారం, వెండి వ్యాపారం జరిగింది. శుభ సమయాల్లో బంగారం కొనడం ఆనవాయితీ కావడంతో, కొనుగోలుదారులు భారీగా కొనుగోళ్లు జరిపారు. ఇప్పుడు, పండుగ తర్వాత రోజుల్లో ధరలు తగ్గడం వ్యాపారులను, వినియోగదారులను మరింత ప్రోత్సహించింది.

నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (తులం) ధర  రూ.1,43,570 వద్ద నిలిచింది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.1,31,600గా ఉంది. ఏపీలోనూ దాదాపుగా ఇవే నమోదు చేస్తున్నాయి.  బంగారం ధరలు తగ్గడంతో వ్యాపార కేంద్రాలు వినియోగదారులతో సందడిగా ఉన్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో, 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.1,43,600 వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర  రూ.1,31,750 వద్ద స్థిరపడింది. ఆర్థిక రాజధానులైన ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో, 24-క్యారెట్ల బంగారం ధర  రూ.1,43,570 కాగా, 22-క్యారెట్ల బంగారం ధర  రూ.1,31,600గా ఉంది. స్థానిక పన్నులు.. రవాణా ఛార్జీలలోని వ్యత్యాసాల కారణంగా, నగరాల వారీగా ధరలలో స్వల్ప తేడాలు ఉన్నాయి.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పడిపోవడం గమనార్హం. పారిశ్రామిక వినియోగం, అంతర్జాతీయ డిమాండ్‌లోని హెచ్చుతగ్గుల ప్రభావం వెండిపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఒక కిలోగ్రాము వెండి ధర  రూ.2,05,000గా ఉంది. వ్యవసాయ బంగారు రుణాలపై ఆర్‌బిఐ కొత్త నిబంధనల నేపథ్యంలో, మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం సాధారణ కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది.

Also Read: 

నేటి నుంచే తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ..కొడంగల్‌లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం..!!

 

 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES