Gold Rate: బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. నేడు నవంబర్ 25వ తేదీ బుధవారం పసిడి ధరలు భారీగా దిగివచ్చాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 3,200 తగ్గింది. దీంతో రూ. 1,24,580కి చేరింది. అటు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 2,950 దిగివచ్చి రూ. 1,14,200కు చేరుకుంది. అటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కిలోపై ఏకంగా రూ. 10వేలు తగ్గి రూ. 1,65,000గా ఉంది. అయితే ఈ ధరలు ప్రాంతాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. ఈ ధరలకు 3శాతం అదనంగా జీఎస్టీ కూడా ఉంటుంది.
గత వారం బంగారం ధరలు భారీగా పడిపోవడంతో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి పండుగ వాతావరణం నెలకొంది. ఆభరణాల దుకాణాలపై వినియోగదారులు కూడా అధిక ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం వంటి వివాహాల సీజన్ కావడంతో, ప్రజలు బంగారం కొనుగోలుపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు, బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయో పరిశీలిద్దాం.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లను పెంచేందుకు బలమైన సూచనలు ఇస్తుండటంతో, డిసెంబర్‌లో రేట్ల పెంపుపై అంచనాలు పెరుగుతున్నాయి. దీనివల్ల మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. బంగారం వంటి ఆస్తుల నుంచి పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచింది. మంగళవారం, స్పాట్ బంగారం ధరలు 2శాతం పడిపోయి ఔన్సుకు $3,556.82 వద్దకు చేరాయి. అంతకుముందు, ట్రేడింగ్‌లో ధరలు $3,552.46 కనిష్ట స్థాయికి చేరాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. గత సెషన్‌లో బంగారం ధరలు దాదాపు 4శాతం పెరిగాయి. అయితే, గత వారం బంగారం ధరలు ఏడాదికి పైగా కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 2.6 శాతం పడిపోయి ఔన్సుకు $3,555.80 వద్దకు చేరాయి.
ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు ఫవాద్ రజాక్జాదా, CNBC వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బంగారం ధరలకు మద్దతు లభించడం లేదని, ఫెడరల్ రిజర్వ్‌తో సహా అనేక కేంద్ర బ్యాంకులు కఠినమైన ద్రవ్య విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. ఇది విలువైన లోహాల ధరలపై ఒత్తిడిని పెంచుతోందని ఆయన చెప్పారు. స్టాక్ మార్కెట్‌లోని అమ్మకాల ఒత్తిడి కూడా బంగారం, వెండి ధరల పతనానికి దోహదపడుతోందని ఆయన తెలిపారు. పెట్టుబడిదారులు తమ మార్జిన్ అవసరాలను తీర్చుకోవడానికి బంగారం, వెండి వంటి లోహాలలో తమ పెట్టుబడులను అమ్ముతున్నారని ఆయన అన్నారు.
Also Read: